10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

 భార్య 


.వె 


భార్య భారమనుచు భావించకెప్పుడు/


కష్ట సుఖము నందు  కలిసి యుండు /


విధి యొసంగి నట్టి    ప్రియ వయస్య పతికి /


ఆధి వ్యాధు లందు నౌషధంబు .


డాకోమలరావు బారువ  11/9/2021


.వె 

కాల మహిమ చేత  నాలి తీరది మారు/


కాలు  తరమె దాట   కాల మహిమ /


కాలు డైన నేమి  కాలాంతకుండైన /


ఆలి మీరి బ్రతుక  జాల గలడె.


కాలుడు = యముడు 

కాలాంతకుడుశివుడు


-కోమలరావు

[9:08 AM, 7/12/2021] 


.వె

ఆలి లేని బ్రతుకు పేలవమైతోచు

ఆలి తోటి బ్రతుకు మేలు కూర్చు 

ఆలి యున్న వేళ  నాదరించకయున్న 

ఆలి పోయి నాక డీలు పోవు 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి