శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ఆ. వె .
వెన్న తిన్న కొంటె చిన్ని కృష్ణు డు తాను /
నోటి లోన చూపె మేటి జగతి /
కోరి భజన చేయు వారికెల్ల రకును /
వెన్నుఁ డిచ్చు శుభము ప్రియము గాను
- డా. కోమలరావు బారువ 12/8/2020
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ఆ. వె .
వెన్న తిన్న కొంటె చిన్ని కృష్ణు డు తాను /
నోటి లోన చూపె మేటి జగతి /
కోరి భజన చేయు వారికెల్ల రకును /
వెన్నుఁ డిచ్చు శుభము ప్రియము గాను
- డా. కోమలరావు బారువ 12/8/2020
జంధ్యాల
తే.గీ
బుద్ధ దేవుని భూమిలో పుట్టి నాఁడు /
కరుణ తోడ కుంతి విలాప కథను చెప్పె /
పూల కష్టాలు చెప్పెను పూస గుచ్చి /
జగమెరిగినట్టి జంధ్యాల శాస్త్రి గారు /
వందనంబులు నీకు పాపాయ్య శాస్త్రి .
డా. కోమలరావు బారువ .4/8/2021
జీవిత పరమార్థము
వర్షార్థ మష్టా ప్రయతేత మాసాన్
నిశార్థ మర్థం దివసం యతేత
వార్ధక్య హేతో ర్వయసా నవేనా
పరత్ర హేతో రిహ జన్మనా చ.
తే.గీ
వర్ష కాలంబు సుఖముండ వలయు నన్న/
కష్ట పడవలె మనిషి మాసాష్టమందు /
పగలు పనిచేయ వలె రాత్రి పదిలముండ /
వార్ధకమ్మున సుఖియించ వలయు నన్న /
జీవి కష్టించ వలయును యౌవనమున /
నరుఁ డిలను శ్రమించ వలెను పరము కొఱకు.