మిత్రుల గురించి పద్యాలు .
డా. విజయ
ఆ.వె.
విద్య లెన్ని నేర్వ విఱ్ఱ వీగదు తాను/
మిత్రులన్న ప్రాణ మిచ్చుఁ దాను/
రోగులందఱ మఱి బాగుగా చూచేటి/
వినుత వైద్య రత్న ' విజయ ' చాణ.
మణి కుమారికి శుభాభినందనలు
తే.గీ
అరువది సమముల్ నిండిన యతివ *మణికి* /
భావి కాలము సుశ్లోక భాజనమయి /
ఆయు రారోగ్య సంపన్న మై యలరుచు /
వర్ష శతములు పతితోడ వరలు గాక .
సమము = సంవత్సరము
శ్లోకము = కీర్తి
వర్ష శతములు = నూరేండ్లు
కోమలరావు 22/5/2021
బి. వి. యం ప్రసాద్ కి షష్ఠి పూర్తి శుభాకాంక్షలతో
ఆ.వె.
చదువులందు తనకు యెదురులేదను వాఁడు /
పరుగు లందు తనకు తిరుగు లేదు/
'మూవి' లన్న నెపుడు ముందుండు సోగ్గాడు /
మిత్రు లన్న ప్రాణ మిచ్చు వాడు /
ఆరు పదులు దాటు యందగాడు 'బివియం'/
వరలు లే సుఖముగ వంద యేళ్ళు .
- కోమలరావు బారువ 28/5/2021
పి వి సుధాకర్ .
ఆ.
ఆట పాటలందు నందె వేసిన చేయి /
చదువు లందు తాను మొదట నుండు /
నాటకములు వేయ పోటీ పడునెపుడు /
వైద్య సేవ లందు విసుగడెపుడు /
పేరుకు తగినట్టు విమల తేజుఁడు 'సుధా
కరుని' యశము వెల్గు కడ వరకును .
డా. కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి