17, ఫిబ్రవరి 2021, బుధవారం

 వనములు 17/2/2021


వనములు జగతికి  జీవనములు 

జీవనమునకు కావాలి ప్రాణ వాయువులు 

వాయువు కలుషితమైన పోవు నాయువులు 

ఆయువును కాపాడుకో పెంచి వనములు 


వనములు కట్టని ఆనకట్టలు 

ఆనకట్టలకై కొట్టిన వనములు 

వనములాపును చల్లని పవనముల 

పవనముల వలన వర్షించు మేఘములు 

మేఘములు కురియ  పెరుగును వనములు 

వనములు జగతికి జీవనములు 


వనములు పెంచు 

ఆరోగ్యముగా జీవించు 


జీవనము = జలము / జీవితము 


2/2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి