9, మార్చి 2021, మంగళవారం


శివరాత్రి


గీ

తొల్లి విధు విధాతలకు వాదు జరిగె ప్రభు /

 నధికుడ నేన నేన నిదానఁ  జేసి /

వారికి భయదమగు నొక పోరు జరిగె 

నంత లింగమొకటి పుట్టె నాక్ష ణంబ 


పుట్టుక యెఱుగని యభవుడు /

పుట్టె జగతి లింగ రూపమున నిశిరాత్రిన్ /

పుట్టుక యెఱుగని యభవుని /

పుట్టుక *శివరాత్రి*కాదె పుడమి జనులకున్ . 



శివము = శుభము , మంగళం , 



శివ రాత్రి ప్రత్యేకత ఏమిటంటే , మాఘ చతుర్దశి రాత్రి శివుని పుట్టుక అనగా లింగోద్భవము జరిగినదిఎందుకుజరిగిందంటే దానికి శివ పురాణములో ఒక కథ యున్నది.

అదేమనగా , సృష్ట్యాదిలో విష్ణు నాభి కమలమునుండి బ్రహ్మ పుట్టి పరమాత్మ ఆనతితో సృష్టి చేసి

తన జన్మకు కారణమైన శేష శయనుడైన విష్ణుమూర్తిని చూచి తానే అన్నిటి కారణమని మూలమని తలచినాడుఅట్లాతలచి తనను గౌరవించక హాయిగా నిద్రించుచున్న విష్ణువును చూచి పరుషముగా పలికి సృషికర్తను నేననిఅహంకరించునుఅప్పుడు వారిద్దరికి  ఘోర మైన పోరు  జరుగును


ఆక్షణములో పరమశివుడు ఆది మధ్యాంత  రహితమైన లింగ రూపములో ఆవిర్భవించి ,తన ఆది అంతములనుతెలుసుకొనమని చెప్పును . 

 లింగోద్భవ పుణ్య దినమే శివరాత్రి గా మనము జరుపుకుంటున్నాము


రచన  డా .కోమలరావు బారువ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి