చెట్టు - సిగరెట్టు
కట్టె కాల్చగా వచ్చేది ధూమం.
సిగరెట్టు కాల్చగా వచ్చేది ధూమం .
కట్టె చచ్చిన వానిని కాల్చును.
సిగరెట్టు బ్రతికిన వానిని కాల్చును.
కట్టెకు , సిగరెట్టు కు ఉనికి పట్టు చెట్లే
తరచి తరచి చూడగా రెండును చెట్లే .
వృక్షాలలో రాజు 'టేకు' చెట్టు.
రోగానికి కారణం 'పొగాకు' చెట్టు.
చెట్టు మనిషికి ఉన్నతిని చూపెట్టు.
సిగరెట్టు మనిషికి పతనాన్ని చూపెట్టు.
చెట్టు ఆమ్లజని యిచ్చి మనిషిని బ్రతికిస్తుంది
సిగరెట్టు బొగ్గు పులుసు నిచ్చి మనిషిని హింసిస్తుంది.
కట్టెలను కాల్చితే జరిగేది యజ్ఞము.
సిగరెట్టు కాల్చితే వచ్చేది యక్ష్మము.
కాబట్టి
చెట్లను విరివిగా నాటండి.
సిగరెట్లను కాల్చడం మానండి.
డా. కోమలరావు బారువ 18/11/2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి