తెలుగు అక్షరమాల దుస్థితి
ఆ.వె.
అమ్మ చిక్కిపోయె అక్షర లేమితో/
ఋణము తీరి పోయె ఋ, ఌ ల కందు/
కళ్ళు , పెళ్ళి , చూడ కల్లు పెల్లిగ మారె/
నేటి తెలుగు కళ్ళ నీళ్ళు తెచ్చె.
ఆ.వె.
మరచె ౘౙలు బండి ఱ' ' ర ' గ మార్పునుజెందె/
వీణ, వేణు, వీన ,వేను, వయ్యె/
తెలుగు సరిగ పలికి తెలుగువెలుగునిల్పి/
తేజరిల్లవయ్య తెలుగు వాడ.
ఆ.వె
అర్థ సున్న పదము లరుదుగా కననయ్యె/
భాష విలువ తరిగె భావ ముడిగె/
దాక అనగ చట్టి (కుండ) దాఁ క అనఁ వరకు/
తెలియు మోయి నీవు తెలుగు వాడ.
డా. కోమలరావు బారువ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి