13, జనవరి 2017, శుక్రవారం

సంక్రాంతి

ప్రతిరోజు వస్తుంది మనకొక రాత్రి
ఏడాదికొక సారి వస్తుంది సంకురాత్రి

రాత్రి తరిగితే వస్తుంది తూరుపు వెలుగు
భోగి రాత్రి మరలితే సంక్రాంతి వెలుగు

 సూర్య దేవుని ఉత్తరాయణ పయనం
లోకానికి సంక్రాంతి ఆగమనం

ధర్మార్ధ కామ ప్రదాయని సంక్రాంతి
బంధు మిత్ర కళత్ర సంధాయని సంక్రాంతి

ఆరోజు

ఇంటి ముందు పెట్తారు పేడతో గొబ్బిల్లు
నిండుగా ఉండాలని పాడితో మన లోగిల్లు

పితృదేవతలకు నైవేద్యాలు
పిండివంటల వైవిధ్యాలు

తనయులకు విధ్యుక్త  కర్మము
అదేమన సనాతన ధర్మము

 కొలువైన బొమ్మల కొలువులు
జనుల ఆనందానికి నెలవులు

గంగిరెద్దుల ఆటలు
హరిదాసుల పాటలు

కోడి పందాల  పంతాలు
గాలి పటాల కేరింతలు

వెరసి
మన తెలుగు సంక్రాంతి
మీకివ్వాలి శాంతి దాంతి

కోమలరావు బారువ. 14/11/2017



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి