15, జనవరి 2017, ఆదివారం

 

నేటి తల్లి దండ్రుల దుస్థితి

తే . బిడ్డ పుట్టి నపుడె విత్తు నాటె నొకడు
      విత్తు పెరిగి పెద్ద విటపి యయ్యె
       కొడుకు పెరిగి తాను కోటీశ్వరుండయ్యె
       కొడుకు విడువ చెట్టు గూడు నిచ్చె



సృష్టి.               నేటి తల్లి దండ్రుల దుస్థుతి -------- ఉప్పును సృజించితివి నీ వప్పుల సొంపుగ రసాల వృక్షమ్ము భువిన్ గొప్పగ రెంటిని తగ నే ర్పొప్పన్  గల్పితివి నిన్ను పొగడన్ తరమే 





తెలుగు అక్షరమాల దుస్థితి

ఆ.వె.
           అమ్మ చిక్కిపోయె అక్షర లేమితో/

           ఋణము తీరి పోయె ఋ, ఌ  ల కందు/

           కళ్ళు , పెళ్ళి , చూడ కల్లు పెల్లిగ మారె/

           నేటి తెలుగు కళ్ళ నీళ్ళు  తెచ్చె.


     
   ఆ.వె.    

   మరచె  ౘౙలు బండి  ఱ'  ' ర '  గ   మార్పునుజెందె/
            
    వీణ, వేణు, వీన ,వేను, వయ్యె/

   తెలుగు సరిగ పలికి తెలుగువెలుగునిల్పి/

   తేజరిల్లవయ్య తెలుగు వాడ.

ఆ.వె


అర్థ సున్న పదము లరుదుగా కననయ్యె/

భాష విలువ తరిగె భావ ముడిగె/

దాక అనగ చట్టి (కుండ) దాఁ క  అనఁ వరకు/

తెలియు మోయి నీవు తెలుగు వాడ.


డా. కోమలరావు బారువ 

13, జనవరి 2017, శుక్రవారం

సంక్రాంతి

ప్రతిరోజు వస్తుంది మనకొక రాత్రి
ఏడాదికొక సారి వస్తుంది సంకురాత్రి

రాత్రి తరిగితే వస్తుంది తూరుపు వెలుగు
భోగి రాత్రి మరలితే సంక్రాంతి వెలుగు

 సూర్య దేవుని ఉత్తరాయణ పయనం
లోకానికి సంక్రాంతి ఆగమనం

ధర్మార్ధ కామ ప్రదాయని సంక్రాంతి
బంధు మిత్ర కళత్ర సంధాయని సంక్రాంతి

ఆరోజు

ఇంటి ముందు పెట్తారు పేడతో గొబ్బిల్లు
నిండుగా ఉండాలని పాడితో మన లోగిల్లు

పితృదేవతలకు నైవేద్యాలు
పిండివంటల వైవిధ్యాలు

తనయులకు విధ్యుక్త  కర్మము
అదేమన సనాతన ధర్మము

 కొలువైన బొమ్మల కొలువులు
జనుల ఆనందానికి నెలవులు

గంగిరెద్దుల ఆటలు
హరిదాసుల పాటలు

కోడి పందాల  పంతాలు
గాలి పటాల కేరింతలు

వెరసి
మన తెలుగు సంక్రాంతి
మీకివ్వాలి శాంతి దాంతి

కోమలరావు బారువ. 14/11/2017