ఏకంసద్విప్రా బహుదా వదంతి
ఆ.వె. బండరాయి నొకడు మంచి శిల్పము చెక్క
చివరి ముక్క నొకడు చేసె చాకి
చివరి ముక్క నొకడు చేసె చాకి
పూజలందె నొకటి పుణ్య మేమో కాని
పాప మేమొ చాకి వీపు పగిలె
ఆ.వె. వరము నిచ్చు నొకటికరములన్మోడ్చిన
మురికి మాపు రేవులోని ఱాయి
రేవులోని ఱాయ? దేవుడయినఱాయ?
ఎంచి చూడ గొప్ప ఏది అగును?
తే.గీ. గుడిలోని ఱాయి మనసు శుద్ధి చేయు
చాకి ఱాయ మడుగు మైల దీర్చు
తరచి చూడ రెండు రప్పలే యైనను
ఉనికి బట్టి వాని ఘనత మారు
( కీర్తి శేషులు నటుడు రంగనాథ్ కి
కృతజ్ఞతలు . వారు ANDHRA JYOTHI channel లో చెప్పిన దానికి పద్య రూపము )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి