22, మే 2011, ఆదివారం

మామ మీసం మీద సీసము



మామ మీసం మీద సీసము


ఈ భూమి అంతమై పో తుందని భయపడే జనులకు ఓదార్పుగా,సరదాగా ఒక సీస పద్యం



సీ”  ఎవ్వాని మీసము యేపుగా పెరుగునో

                   మోమున  యూడలై సొగసు కూర్ప

      ఎవ్వాని మీసము   ఎదుగునో రొయ్యలా

                             బారుగా  రోషమ్ము పరిఢ విల్ల  

      ఎవ్వాని మీసము   యెలమి మేఘము వోలె

                           కన్పట్టు చూపరుల్ కలత నొంద    

      నెవ్వాని మీసము   నిమ్మలకాధార  

                          మైభువి ని మిగుల  యలరు చుండు  

తే.గీ  నట్టి సొగసైన  నల్లని దట్టమైన

       మామ మీసాలు  బలిమిమై భూమి నిలిపి

       పరగు  చుండ జనులు భయపడగ  నేల      

       మామ మీసాలె మహిలోన మనకు రక్ష 



13, మే 2011, శుక్రవారం

నీతి పద్యము


 మన లోకము లో నీచ మైన  పనులు చేస్తూ ఎక్కువ కాలము జీవిస్తే కాకిలా చిర కాలము జీవించే కంటే హంస లాగ జీవించాలని అంటారు .
 అదే అందముగా ఆటవెలది  పద్యంలో చెప్తే
ఆ.వె     కావు కావు మనుచు కాకి చిరమునుండు /

              అంచ రాజసముగ  నసువు బాయు /

          చెనటి   చెడ్డ పనులు చేయుచు మురియును/

           నీతిపరుడు భువిని ఖ్యాతి నొందు.

  krbaruva,blogspot.com  

5, మే 2011, గురువారం

ధనం – ఇందనం



ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇందనం లేకున్న కదలదు  ఇంజను బండి

ధనమూలమిధం  జగత్తు అన్నారానాడు
ఇందనమే అన్నిటికి కీలకమన్నారీనాడు

ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇందనం  నిండుగా ఉంటే పెరుగు వాహనముల్

ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు (collonization )
ఇందనము కొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు ( gulf war)

ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇందనము నకు మనిసి బానిసైనాడీనాడు

ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇందనము ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు

ధనం విలువ రాను రాను శూన్యం
ఇందనము విలువ పోను పోను అనూహ్యం




         

4, మే 2011, బుధవారం

సుందరి అందం

నేనొ  వాసర వేళన్

   చెన్నుగ నేఁబోవుచుండ  చెంతన గంటిన్ 

   వాల్గంటిని గంటిన్ కనినంతనె

  తనువంత పరవ శమయ్యె తన్విన్  చూడన్


 సుందరి కన్నులు కలువలు

    సుందరి  నగు మో ము పోలు చుక్కల ఱేనిన్ /

    సుందరి నెఱి  కురులు యిరులు

   సుందరి  నెన్నడుము గగన సుమమే కనఁగన్ 


.   సుందరి నాసిక సంపెఁగ

     సుందరి వాతెఱ పగడపు సొగసును పోలున్

     సుందరి కంఠము శంఖము 

     సుందరి  మృదురావమందు సుధ లూరంగన్ 


.వె       ఆమె చనులు  మేలి బంగరు గిన్నెలు

            ఆమె కనులు వికసిత జలజములు       

            ఆమె కౌను  చూడ  నంబర  కుసుమము

            ఆమె నడక చూడ నంచ గమన

 

www.krbaruva.blogspot.com


 


1, మే 2011, ఆదివారం

వసంతాగమము


}   సీ. కొమ్మ ప్రాయపు వేళ కోకకట్టిన రీతి వనములన్ని చిగిర్చి వన్నె చూపె
       పువ్వుబోడి      పయోదముల కెనయౌనన విరవాది గుత్తులు విరుగ బూసె
         అలికులవేణి వేనలి మాకెనయౌ నేయంచు అలికులంబేగు దెంచె 
          విరిబోణి మృదు వాణి  సరిరాదు మాకంచు పంచమములు కూసె పంచమమ్ము 
}                                        తే.  వన్నె మీర లేజిగురాకు వలువ కట్టి 
}                                              యిరుల బోలు పెన్నెరులలో విరులు పెట్టి 
}                                              పరవశించి కోయిల పంచమమ్ము  పాడ
}                                             పుడమి పులకించె వనలక్ష్మి పొలయు వేళ 
}