15, అక్టోబర్ 2024, మంగళవారం

 రతన్ టాటా కు అశ్రునివాళి  😂🌹🙏


ఎవరి పేర వెలసె నినుప  కార్కానంబు బీహారు రాష్ట్ర మందు .

ఎవరి పేర జమ్షెడ్ టాటా నగరాలు వెలసి ఘనతకెక్కె .

లారీలన్న టాటాలేలాండ్ లారీలె యని దేశాన రాణకెక్కె .

పేద వాడి వాహనమన్నని లక్ష కే నానో కారు యెవ్వడిచ్చె 

టిసియెస్ యనుపేర కంప్యూటర్ కంపెనీ ఖ్యాతినొందె 

ఎయిర్ ఇండియా ఎవరి వాయుయానసంస్థగా వన్నెకెక్కె 

ఉప్పు పప్పు టీ యిత్యాదులందు ఏ సంస్థ ముందుండె 

ఇన్ని  స్థాపించి దేశ ప్రగతికి పాటుపడిన నిస్వార్థ జీవి 

టాటా వంశ పయోధి చంద్రుడు రతన్ టాటా నిధనమ్ము 

భారతమ్మునకు తీరని లోటుగా పరిణమించె .

అట్టి మహనీయుని మరువదీ భరతభూమి 

కోట్లాది భారతీయుల ఆశాదీపమారిపోయె నేడు .

కన్నీటి వీడ్కోలందుకొనుమా భారత  రతన(మా  ) టాటా నీకు .😂🌹🙏

KR

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి