శ్లో
హసంతీం చ హసంతీం చ
హసంతీం వామలోచనామ్
హేమంతే యే న సేవన్తే
తే నరా దైవవంచితాః
గీ.
నిప్పు మండెడు కుంపటిన్ , కప్పు కొనెడి/
దుప్పటిన్ వామలోచనా గొప్ప పొందు /
శీత వేళల కోరని జీవుడెందు /
భాగ్య హీనుడు పరికింప పదుగురందు .
దీనిలో హసంతీ శబ్దం
మూడుమార్లు ప్రయోగించబడింది.ఒకదానికి కుంపటి,మరొకటి కంబళి,
మూడవదానికి నవ్వుతున్నఅనే విశేషణార్థం.
తా.
కుంపటినిగాని, కంబళినిగాని
నవ్వుతూన్న అందమైన కన్నులున్న
యువతినిగాని చలికాలంలో ఎవరు ఆశ్రయించరో,
వారు దురదృష్టవంతులు - అని చెబుతున్నాడు కవి.