కెనడా
పంట వలంతి శిరంబున సీమంతంబు సరణి
టొరోంటో నగరమ్ము కెనడాకు ఒప్పుమీరె
రహదారులన్నియు రమణీయ రంగులీనుచు రాణనొప్పె
ఎన్ని వాహనములున్న (నిసుమంత) ధ్వని కాలుష్యమ్ము హుళక్కి .
పాదచారులకు వికలాంగులకు పెద్దపీట వేసె
విశాల పణ్య ప్రాంగణములు చూపరులకు వింతగొల్పు
వస్తు ధరలేమొ వినఁగ విస్తు గొల్పె / జాస్తిగుండె
పణ్యాంగణ మధ్యంబున కలవు సూచికా ఫలకంబులు
సులువుగా వస్తువుల కొనఁగ మార్గములు చూపు
నగర మధ్యంబున పచ్చని నగములు కనగనయ్యె / కాననయ్యె
టొరోంటో పుర సుందరి పచ్చని చీర కట్టినట్టు
ఎచట చూచిన పసందైన భోజన శాలలే
రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులే
సోయగాలు చిందు నగరవీథులు సంతోష మొదవ జేయ
సొమ్ములున్న ను చాలు సోకులకేమి కొదువ యనరే
మత్స్య ప్రదర్శన శాల వీక్షణంబు (Acuarium)
మిక్కిలి సంతోషదాయకంబు
అభ్రంకషాయిత టీవి శిఖరంబు
చూడ గ్రీవా క్లేశ కారణంబు
అట్టావా పయనము :
వాహినీ ప్రవాహములా వాహన సముదాయము
నాగుపామువలె మెలికలు తిరుగు నేషనల్ హైవే కి
రెండు వైపుల పచ్చనిఎత్తైన చెట్లు
ఆ పచ్చదనము జూచి కనులకు కలుగు మిరుమిట్లు.
రిడావ్ అట్టావ్ నదుల సంగమ స్థలము
అట్టావ పుటభేదనమ్ము కెనడా రాజధానిగా యొప్పె
కెథడ్రల్ ఆకారములో కెనడా పార్లమెంట్
కొలోనియల్ కాలమునాటి పాలనకు నిదర్శనంబు
నగరము మధ్యలో నౌకల ప్రయాణము
చూచువారి కనులకు కలిగించు వినోదము .
నయాగరా
శివుని శిరమునుండి గారు చదలేఱు
క్రిందికిజాతు. నురగల జల పాతము
గంగవలె చిందులు త్రొక్కు నయాగరాను
ఎంతని పొగడనుసొగసు ఏమని చెప్పను
కెనడా అమెరికాలను విడదీయు జల ప్రవాహం
రెండు దేశాలకు పసందైన పర్యాటక కేంద్రము
ఈరి నది మాతృకగా నయగరా పయనం
జలపాతమై లేక్ ఒంటారియా లో కలయిక
మద్యాహ్నపు వేళ మార్తండుని రశ్మి సోకి వెండి వోలె
తళ తళ మెరయు జలోపరితలము వింత గొలుపు
ఆకాశ వీథిలో విహరించు జల విహంగాలు
పోటీ పడి పై కెగయు జల పాత శీకరాలు
ఆకాశ వీథిలో పక్షుల కోలాహలము
నేల మీద ప్రేక్షక జన సందోహము
ఆకుపచ్చ రంగులీనుచు అలరారు ఉదృత జలం
పొంగులు వారుచు క్రిందికురికి చేరు నొంటారియో తటాకం
బండ మీఁద పక్షులు కూర్చుండె .
కాళ్ళు పీకి బల్లల మీద కూర్చుండె జనం
ఎంత మాటకారులనైనా నోరు
మూయించు నయాగరా హోరు
---------