5, సెప్టెంబర్ 2022, సోమవారం

 


అంతరిస్తున్న పక్షి (బంధువురాబందు 


Image.jpeg


తే

రెక్కలందు బలము ,వాడి ముక్కు కల్గి /

చచ్చిన పసులను  తినుచు మెచ్చు జీవి / (పక్షి ) 

కలుష తమ్మైన భూమిని కలుష రహితఁ/

జేయు  నట్టి రాబందులు క్షీణ మయ్యె .


డాకోమలరావు 

 గురువందనము 

తే .

గురువు విద్యార్థి యజ్ఞాన కరువు బాపు /

గురువు వినయవిధేయత గఱపి చూపు /

గురువు తిమిరమందు వెలుగు తరణి  సముఁడు /

నతులు చేసెదట్టి గురుని మతిఁ దలంచి .


డాకోమలరావు బారువ .5/9/2022