శ్లో
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం/
ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాష్మహే/
తే.
జ్ఞాన శక్తి కి నిలయంబవైన దేవ /
అమలిన స్ఫటికాకృతి న లరినట్టి /
సర్వ విద్యలకున్రహి స్థంభ మైన
అశ్వ కంధరా ! నా నతులందు కొనుమ .
డా. కోమలరావు 12/8/2022
శ్లో
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం/
ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాష్మహే/
తే.
జ్ఞాన శక్తి కి నిలయంబవైన దేవ /
అమలిన స్ఫటికాకృతి న లరినట్టి /
సర్వ విద్యలకున్రహి స్థంభ మైన
అశ్వ కంధరా ! నా నతులందు కొనుమ .
డా. కోమలరావు 12/8/2022
ఆ.వె
చెళ్ల పిళ్ల వారి చెల్లియో చెల్లకో/
పద్య గుళిక లొప్పె ప్రజల నోళ్ళ /
పద్య మున్న వరకు బ్రతుకును వేంకట /
శాస్త్రి తెలుగు నేల శాశ్వతముగ .
డా. కోమలరావు 8/8/2022
జెండాకు వందనము
సత్యాగ్రహమ్మె స్వతంత్ర సాధనమ్మనియె నొకఁ డు .
స్వతంత్రమ్ము నా జన్మ హక్కని గద్దించెనొకఁ డు.
మాకొద్దు ఈ తెల్లదొరతరమనిప్రతిఘటించెనొకఁ డు .
తెలుగు వీర లేవరాయని యెలుగెత్తెనొకఁ డు.
తుపాకీ గుండుకు తన గుండె చూపెనొకఁ డు .
గుండు తోడనె స్వతంత్రమ్ము సిద్ధించు ననియె నొకఁ డు .
చెయ్యెత్తి జై కొట్టమని నినదించెదె నొకఁడు .
అందరి త్యాగ ఫలమ్మె
మన స్వతంత్ర ఫలమ్ము
ఆ స్వతంత్ర ప్రతీక గా
పింగళి సృష్టించె త్రివర్ణ పతాకమ్ము
వందనమ్ము చేయుడీ మువ్వన్నెల జెండాకు
అమృతోత్సవ స్వతంత్ర వత్సరమున
జై హింద్
జై భారత్ .
డా. కోమలరావు బారువ. 7/8/2022
వీరులకు జోహార్లు
తే.
మంచు కొండల మాటున మలగి మలగి /
ప్రాణముల్ మాతృ భూమికై పణము పెట్టి /
శత్రు మూకల చండాడి శాంతి నింపి /
నట్టి వీరులారా!యివే వందనములు .
డా. కోమలరావు. బారువ 27/7/2022