30, జనవరి 2022, ఆదివారం

 హర్షవల్లి 


తే.గీ 


ఒంటి చక్రపు రథములో మింట దిరుగు /

దేవు వాసమ్ము పుణ్య నాగావళి దరి /

తలచు వారికి నారోగ్య దాయకంబు /

 దివాకరు క్షేత్రమ్ము  హర్ష వల్లి .


డాకోమలరావు బారువ ( 30/1/2022)


1, జనవరి 2022, శనివారం

 .వె .

ప్రాత యేడుఁ దలచి బాధ పడగనేల /

ప్రాత యనుభవమ్ము    ప్రతి మనిషికి 

బాధలన్ని బాపి బ్రతుకుల బ్రోవంగ / 

వచ్చె  నూతనాబ్ద  మిచ్చు శుభము 


డాకోమలరావు బారువ 1/1/2022