భగవద్గీత భరత జాతికి మాత
గీతా బోధకుండీ జగతికి పిత
భగవద్గీత జనులకు మార్గ ప్రదాత
గీతా పఠనము జీవికి త్రాత
భగవద్గీత
ఆ.వె
ధర్మ యుద్ధ మందు ధర నుద్భవించెను /
మార్గ శీర్ష పాఢ్య మాది యందు /
కృష్ణ గీత యనగ కృష్ణు గళము నుండి /
పుడమి జనుల కెల్ల మోక్ష దాత /
వ్యాస కృపను సంజయ ఉవాచగా వెల్గె /
నేక దశమి నాఁడు కృష్ణ బోధ .
-------
కురుక్షేత్ర సంగ్రామము మార్గశీర్ష మాసము పాఢ్యమి నాడు మొదలైనది. ఆ యుద్ధాదిలో పరమాత్మ శ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునకు గీతోపదేశము చేసినాఁడు. అది ఏకాదశి నాఁడు అనగా భీష్ముని పతనానంతరము సంజయుని నోట ప్రపంచానికివెల్లడైనది. అందుకే మార్గ శీర్ష ఏకాదశినాఁడు భగవద్గీత జయంతి జరుపుకొనుట.
గీతా సారము
ఆ.
ఆత్మ నిత్యమనియె నర్జున సచివుఁడు /
కర్మ చేయు ( వలయు ) ; వలదు కర్మ ఫలము /
మోజు పడకు పొరుగు పోకడలను చూచి /
శౌరి నుడివినట్టి సార మిదియె .
కృష్ణ గీత
ఆ.వె
మనిషి యెటుల భువిని మనఁగ వలయునట్టి /
బోధ చేసి మనకు ముక్తి నొసఁగు /
భక్తి కర్మ యోగ భాష్య సారాంశ మే /
కృష్ణ దేవు యొక్క గీత యనఁగ .
డా. కోమలరావు బారువ 22/5/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి