చలికాలము - స్వెట్టర్
ఆ.వె
శీత కాలమందు చెలియ కౌగిలికన్న /
రింగు లీనెడు సిగ రెట్టు కన్న /
తెల్ల వారి త్రాగు తేనీటికన్న ను /
వెచ్చ నైన దూలు 'స్వెట్టరే' లె .
వెచ్చ గుంచు నూలు స్వెట్టరే లె
చలికాలము - స్వెట్టర్
ఆ.వె
శీత కాలమందు చెలియ కౌగిలికన్న /
రింగు లీనెడు సిగ రెట్టు కన్న /
తెల్ల వారి త్రాగు తేనీటికన్న ను /
వెచ్చ నైన దూలు 'స్వెట్టరే' లె .
వెచ్చ గుంచు నూలు స్వెట్టరే లె
భగవద్గీత భరత జాతికి మాత
గీతా బోధకుండీ జగతికి పిత
భగవద్గీత జనులకు మార్గ ప్రదాత
గీతా పఠనము జీవికి త్రాత
భగవద్గీత
ఆ.వె
ధర్మ యుద్ధ మందు ధర నుద్భవించెను /
మార్గ శీర్ష పాఢ్య మాది యందు /
కృష్ణ గీత యనగ కృష్ణు గళము నుండి /
పుడమి జనుల కెల్ల మోక్ష దాత /
వ్యాస కృపను సంజయ ఉవాచగా వెల్గె /
నేక దశమి నాఁడు కృష్ణ బోధ .
-------
కురుక్షేత్ర సంగ్రామము మార్గశీర్ష మాసము పాఢ్యమి నాడు మొదలైనది. ఆ యుద్ధాదిలో పరమాత్మ శ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునకు గీతోపదేశము చేసినాఁడు. అది ఏకాదశి నాఁడు అనగా భీష్ముని పతనానంతరము సంజయుని నోట ప్రపంచానికివెల్లడైనది. అందుకే మార్గ శీర్ష ఏకాదశినాఁడు భగవద్గీత జయంతి జరుపుకొనుట.
గీతా సారము
ఆ.
ఆత్మ నిత్యమనియె నర్జున సచివుఁడు /
కర్మ చేయు ( వలయు ) ; వలదు కర్మ ఫలము /
మోజు పడకు పొరుగు పోకడలను చూచి /
శౌరి నుడివినట్టి సార మిదియె .
కృష్ణ గీత
ఆ.వె
మనిషి యెటుల భువిని మనఁగ వలయునట్టి /
బోధ చేసి మనకు ముక్తి నొసఁగు /
భక్తి కర్మ యోగ భాష్య సారాంశ మే /
కృష్ణ దేవు యొక్క గీత యనఁగ .
డా. కోమలరావు బారువ 22/5/2022
కవిత్రయము
తే.గీ
నన్నయ కవికి గీర్వాణ మన్న ప్రీతి/
ఎన్న తిక్కయజ్వకు తెలుగన్న ప్రేమ /
పరగ నెఱ్ఱనార్యుకు రెండు భాష లన్న
దీపి , ముగ్గురుఁ దెలుఁగున దీప శిఖలు .
డా. కోమలరావు బారువ.
తే. గీ
భరత మాతకు బిడ్డలు బిరుదు మగలు /
విపిన రావతా ది ప్రభృతుల్ ; వీర మరణ /
మొందినట్టి సాహస వీరులందరికిని /
అశ్రు నయనాలతో డ నే నంజలింతు .
ఘంటసాల సినిమాసంగీత ప్రస్థానమును పద్య ఖండ కావ్యముగా శ్రీతిరుమల శ్రీనివాసాచారి గారు రచన చేసినారు . దానినుండి శ్రీ శరత్ చంద్రగారు స్వరపరచిన సీస పద్యమును నాకు చేతనైన రీతిలో పాడినది .
రచన:- తిరుమల శ్రీనివాసాచారి.
స్వరకల్పన :- శరత్ చంద్ర .
సీ.
పరవశింపగజేసె 'పాతాళ భైరవి' 'పెళ్లి చేసి చూడు' ప్రీతి నింపె /
ఒక 'చిరంజీవులు' యుయ్యాలలూగించె 'దీపావళి 'యె దివ్య దీప్తి నింపె /
'గుండమ్మ కథ'గుండె నిండుగా సుధ పోసె 'భువనసుందరి కథ'పూలు కురిసె/
మనసును కదలించె 'మాయాబజారు'యిక 'లవకుశ' సంగీత లాస్య మాయె //
గీ.
అబ్బురము గొల్పినది 'రహస్యము' స్తుతింప /
ఘంటసాల సంగీత వికాస దివ్య /
విశ్వ సౌందర్య సౌభాగ్య విమల లలిత /
దర్పణములవి సంగీత దర్శకులకు
సీ
*రాగేశ్వరిని గూర్చి *భాగేశ్వరిని దీర్చి గానామృతము బంచె ఘంటసాల /
*కామవర్ధిని *తోడి , *కాంభోజి రాగాల గళమెత్తి పాడెను ఘంటసాల /
*ఆరభి *జోగియా *హంస నాదములందు నాలపించెను *గీత హ్లాదమొదవ/
*చారుకేశి *వసంత * చంద్రకౌన్సుల యందు శ్లోక గానము చేసి సుఖము గూర్చె.
*మలయ మారుతమ్మును పాడి మనసు దోచె/
రంజనము గూర్చె లే *శివరంజని శ్రుతి/
*మోహన ను పాడి యెదల సమ్మోహపరచె/
అవని సుఖియింప బాడె *కల్యాణి యందు .
సీ
తలనిండ పూదండ దాల్చి వచ్చును రాణి కల్యాణి రాగాన గళము నెత్త /
ఆనందమర్ణమైనట్టులగపించు మధుర వాణి యె నృత్య మధువు చిలుక /
మౌనము గానున్న మానస వీణ మ్రోగినయటులుండు మోహనను పాడ /
వేషము మార్చిన భాషను నేర్చిన ననబోడిని వలచు మోహనను పాడ//
గీ.
ఎంత హాయిని నింపెనో యెదలయందు /
ఘంటసాల మోహనమున గళమునెత్త /
చెంగు చెంగున దూకెలే చిలిపి తలపు /
వాణి కనువైన అందాల బాణి కూర్ప
సీ.
అతడు భీంప్లాసులో ఆలపించిన భలే మంచి రోజని జనులెంచినారు /
ఆతడభేరి లో హాయిగా పాడగా అందమే ఆనందమై హసించె /
శృతి చూచి మధ్యమా వతి నాలపింపగా మల్లియలెల్లను మాలికాయె /
సింధు భైరవిలోన చిలికింప రాగమ్ము సన్నగా వీచెను చల్లగాలి //
వాణి ప్రస్తుతించుచు సరస్వతిని పాడి /
ఇందిరను గొల్చె శ్రీరాగమందు పాడి /
లలిత రాగాన కీర్తించె లలిత నతఁడు/
గాన సాహిత్య మణిమాల ఘంటసాల .