గణపతి
తే.గీ
పసుపు ప్రతిమ యుసురు పొంది పాప డయ్యె /
వాడు శిరము పోయి కరి వదను డైన /
కరి ముఖుండు విఘ్నముల పో కార్చి సతము /
సకల జగముల రక్షించి సాకు గాక .
గణపతి
తే.గీ
పసుపు ప్రతిమ యుసురు పొంది పాప డయ్యె /
వాడు శిరము పోయి కరి వదను డైన /
కరి ముఖుండు విఘ్నముల పో కార్చి సతము /
సకల జగముల రక్షించి సాకు గాక .
భార్య
ఆ.వె
భార్య భారమనుచు భావించకెప్పుడు/
కష్ట సుఖము నందు కలిసి యుండు /
విధి యొసంగి నట్టి ప్రియ వయస్య పతికి /
ఆధి వ్యాధు లందు నౌషధంబు .
డా. కోమలరావు బారువ 11/9/2021
ఆ.వె
కాల మహిమ చేత నాలి తీరది మారు/
కాలు తరమె దాట కాల మహిమ /
కాలు డైన నేమి కాలాంతకుండైన /
ఆలి మీరి బ్రతుక జాల గలడె.
కాలుడు = యముడు
కాలాంతకుడు= శివుడు.
-కోమలరావు
[9:08 AM, 7/12/2021]
ఆ.వె
ఆలి లేని బ్రతుకు పేలవమైతోచు
ఆలి తోటి బ్రతుకు మేలు కూర్చు
ఆలి యున్న వేళ నాదరించకయున్న
ఆలి పోయి నాక డీలు పోవు
భానుమతి
ఆ.వె
భాను మతిని చూడ భావముప్పొంగులే /
పాట వినగ మనసు పరవశించు /
భాను మతియనంగ బహుముఖ నైపుణీ /
తెలుగు చలన చిత్ర వెలుగు దివ్వె /
గురు పూజ
గురుః బ్రహ్మ గురుః విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
--
ఆ. వె.
అరయ గురువు బ్రహ్మ యండ్రీ జగతి లోన /
భువిని గురువు శ్రీధవుండు నెంచ /
చూడ నొజ్జ మరియు శూలపాణి పృథివి /
గాన గురుని పూజ ఘనత మనకు .
గురువు నేర్పిన విద్యలు కూడు బెట్టు
గురువు నేర్పిన విద్యలు గుణము నిచ్చు
జ్ఞాన ఖనియైన గురువు చే జ్ఞాన మబ్బు
కాన దేవుడు గురువే జగాన చూడ
డా .కోమలరావు బారువ