11, ఏప్రిల్ 2020, శనివారం

శ్రీరామ రక్ష 

సీస మాలిక 
ద్వారపాలకులపై  దయచూపుటకునై  భువి నవతరించిన విష్ణు వతఁడు/
సృష్టికి ప్రతి సృష్టి చేసిన కౌశికు యాగముఁ  గాచినయజ్ఞ భోక్త /
పడతి యహల్య శాపముఁబాపి కరుణతో మోక్షమొసఁగిన పద్మాక్షుఁడతఁడు/
తండ్రి మాట కొఱకు తపసియై రాజ్యముఁ దమ్మున కిడినట్టి త్యాగ ధనుడు /
భక్తులం దున భేదభావమ్ము నరయక గుహుని బ్రోచిన సాధు గుణయుతుండు
వనచరున్  వాసవిఁ పరిమార్చి భానుజున్ చేపట్టినట్టి సుస్నేహశీలి
పగతు సోదరుఁ డని పరిమార్చక విభీషణాఖ్యుఁగాచిన కరుణా   మయుండు /
ధర్మంబు భువి నిల్ప ధరణిపైవెలసినధర్మరూపుఁడుపరంధాముడతఁడు//

గీ
రాము డనఁగధరణిపైన రహి జనించి/
పుణ్య సుగుణాభి ధాముఁడు మోహనుండు/
దశరథుని పుణ్య ఫలమైన తరణి కులుఁడు/
రాముఁడనయంబు మననెల్ల రక్ష సేయు 


... కోమలరావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి