9, మే 2019, గురువారం

గేయము. రచన. : డా. కోమలరావు బారువ
 చూచి వద్దము రండి శ్రీకాకుళం.
 ఉత్తరాంధ్రకు మంచి మణి కిరీటం.  // చూచి//
 1. నాగావళీనదీ  నాట్యాలతో .
  వంశధార   వేణు గానాలతో.
   పల్లవించే పంట క్షేత్రాలతో  .
పాడి పంటలు కలుగు శ్రీకాకుళం

  // చూచి  //
 2. రుద్ర కోటీశుడు, మల్లిఖార్జునుడు,
 ప్రత్యక్ష దైవము   అరసవల్లి  స్వామి.
  కోరికలు తీర్చేటి శ్రీకూర్మనాథుడు.
కొలువు దీరినట్టీ  శ్రీకాకుళం     // చూచి //

 3. అలనాటి గజపతులు ఏలినట్టి నేల.
   ముఖలింగేశుని మురిపంపు హేల .
బౌద్ధ వృక్షపు శాఖ పల్లవించిన నేల.
   పొందూరు ఖద్దరు పరిఢవిల్లే నేల. //చూచి //

 4. ఆట పాటలకు ఆలవాలమీ నేల .
తప్పెట్ల గుళ్ళకు కాణాచి ఈ నేల.
  సొగసైన సొంపైన సాగరతీరాలు .
ప్రకృతి అందాలు కలవెన్నొ ఈనేల. // చూచి //
 5.       
సవర భాషకు పిత గిడుగు నడచిన నేల/
వడ్డాది కలముతో కదంతొక్కిన నేల /
ఉద్దానం బొండాలు మందస హల్వా/
పసందైన పలాస జీడిపప్పు గల నేల.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి