భోగి పండుగ
తే.గీ
చలిని పారదోలును భోగి చెలియ భంగి/
రేగు పండ్లు పోసెదరోయి భోగి నాఁడు
భోగి శయను పొందెను గోద భోగి నాడు/
భోగి మానవాళికి నిచ్చు భోగములను.
తా.
భోగి సమయంలో ఉన్న చలిని భోగి మంటలు పోగొట్టును.
అదెలాగంటే ప్రేయసి దగ్గర వెచ్చగా నున్నట్లు . భోగి నాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆనందిస్తారు . గోదాదేవి భోగినాడు శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీరంగ స్వామిని వివాహం చేసుకున్నది. భోగి మానవులందరకు భోగములనిచ్చు గాక.
బారువ కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి