18, మే 2013, శనివారం

ఎయిడ్సు రోగం రచన : డాకోమలరావు బారువ 


తే.గీ


శ్రీలు విలసిల్లుసిక్కోలు -ప్రోలు నందు/

మనుజులెవ్వరు మసలని మాడి మీద/

క్షయ , ఎయిడ్సు విరేచన కారకాలు /

చేసె వార్షిక రోగ విశ్లేషణమ్ము


.

 సభలో వాటికి తమలో నేను గొప్ప అంటే నేను అని వాదన జరుగ నప్పుడు 

 ఎయిడ్సు వైరస్ మీ అందరికికన్న పరికింపఁగ నేనే గొప్ప యని నుడువఁగ దానికి

మిగిలిన జీవులు ఋజువులేమని ప్రశ్నించ నప్పుడు ఎయిడ్సు వైరస్ యిట్లు చెప్పఁదొడంగె .


.వె . 


యక్ష్మమునకు  భువి క్షయము కల్గు మందుచే /

నాకు క్షయము లేదు మీకు మాడ్కి /

ప్రాణ హాని లేదు పరికింప మీ వల్ల /

ఉసుఱుపోవు నాదు విసము కతన .


.అనవుడు నీవు మనిషి శరీరము లోనికి ఎలా ప్రవేశిస్తావు,నివారణ ఏమైన ఉన్నదాయని యడుగఁ నది యిట్లనియెన్ 


కం.


వెలదుల పొందున,సూదుల/

వలనన్,వాడిన సిరంజి వాడుట  వలనన్/

వలసిన రక్షణ లేమిన్/

కలిగింతు నెయిడ్సు జబ్బు కాముకులకిలన్.


.మరి నివారణ యెటుల 


కం

వాడకు మితరుల రేజరు/

బ్లేడుల,సూదుల ,సిరంజి , బేండెజులెందున్/

వాడుము తప్పక కాండొం

వీడుము పరసతుల పొందు వేడుకకైనన్.


కం

వీడకు కులసతి కౌగిలి/

కూడకుమెప్పుడు పనివడి కులటల పొందున్ /

కూడదు సంపర్కమ్బిల/

పేడుల ; నిజ సతుల పొందు వీడకుమెపుడున్ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి