18, మే 2013, శనివారం
ఎయిడ్సు రోగం రచన : డా. కోమలరావు బారువ
తే.గీ.
శ్రీలు విలసిల్లు. సిక్కోలు -ప్రోలు నందు/
మనుజులెవ్వరు మసలని మాడి మీద/
క్షయ , ఎయిడ్సు విరేచన కారకాలు /
చేసె వార్షిక రోగ విశ్లేషణమ్ము.
వ.
ఆ సభలో వాటికి తమలో నేను గొప్ప అంటే నేను అని వాదన జరుగ నప్పుడు
ఎయిడ్సు వైరస్ మీ అందరికికన్న పరికింపఁగ నేనే గొప్ప యని నుడువఁగ దానికి
మిగిలిన జీవులు ఋజువులేమని ప్రశ్నించ నప్పుడు ఎయిడ్సు వైరస్ యిట్లు చెప్పఁదొడంగె .
ఆ.వె .
యక్ష్మమునకు భువి క్షయము కల్గు మందుచే /
నాకు క్షయము లేదు మీకు మాడ్కి /
ప్రాణ హాని లేదు పరికింప మీ వల్ల /
ఉసుఱుపోవు నాదు విసము కతన .
వ.అనవుడు నీవు మనిషి శరీరము లోనికి ఎలా ప్రవేశిస్తావు,నివారణ ఏమైన ఉన్నదాయని యడుగఁ నది యిట్లనియెన్
కం.
వెలదుల పొందున,సూదుల/
వలనన్,వాడిన సిరంజి వాడుట వలనన్/
వలసిన రక్షణ లేమిన్/
కలిగింతు నెయిడ్సు జబ్బు కాముకులకిలన్.
వ.మరి నివారణ యెటుల
కం.
వాడకు మితరుల రేజరు/
బ్లేడుల,సూదుల ,సిరంజి , బేండెజులెందున్/
వాడుము తప్పక కాండొం/
వీడుము పరసతుల పొందు వేడుకకైనన్.
కం.
వీడకు కులసతి కౌగిలి/
కూడకుమెప్పుడు పనివడి కులటల పొందున్ /
కూడదు సంపర్కమ్బిల/
పేడుల ; నిజ సతుల పొందు వీడకుమెపుడున్ .