10, నవంబర్ 2024, ఆదివారం

 కవేరా కు నివాళి .

బూర్జ మండలంబు తోటవాడ యందు తేజరిల్లిన వాడు. 


చిన్నతనమునందె తెలుగు కవితలు వ్రాయ మరగిన వాడు. 


వృత్తి యందే కాదు సాహిత్య ప్రవృత్తి యందు పరగు వాడు . 


విమర్శలయందు విశృంఖలుండు. వితరణ యందసదృశుడు . 


తెలుగు గ్రంధములన్న తప్పక కొని చదివే వాడు . 


గ్రంధాలయమునే యింట నెలకొల్పినవాడు .


పద్య మన్నను కొంత మక్కువున్నను కాని వచన కవితలన్న మిగుల యిష్టమ్ము కలవాడు . 


ఆత్మ కథలన్న ( Auto biographies) అఱ్ఱులు చాచే వాడు .


సాహిత్య సీమలో తన కొక్క గుర్తింపు కలవాడు .


 కవేరా కు నివాళి .


 తేట గీతి మాలిక

 కణుగులాన్వయమందున జనన మంది / 

శైశవమునుండె సాహిత్య ద్యాస కలిగి /

 సత్ప్ర వర్తన కల్గిన సంతుఁ బడసి /

పోస్ట లోద్యోగి యై  వృత్తి పూర్తి చేసి /

 శేష జీవితమ్ము గడిపె చింత లేక/

తొమ్మిది పదుల వయసున తొలగె దివికి /

 అతని కంటె ధన్యు డెవరీ యవని యందు / 

అతడె పో 'కవేరా' చూడ నమిత యశుడు. 

-----

అన్వయము = వంశము . సంతు = సంతానము . 


డా. కోమలరావు బారువ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి