11, ఆగస్టు 2023, శుక్రవారం

 మామిడి తాండ్ర



   దోర  పండిన మామిడి గుజ్జు తీసి

       లోతు పాత్రలో మెత్తగా ఉడక బెట్టి

      నిమ్మ రసమును ,చక్కెర  మేళవించి              

        ఆర బెట్ట వచ్చినదియే  మావి తాండ్ర (ఆంధ్ర)


చూత ఫలము తెచ్చి ముక్కలు  కోయించి

ఉప్పు కారమావ పొడిని కూర్చి

 తైల మందు  కొంత  కాలమ్ము ఊరగా

అదియె కాద?   ఆంధ్ర  ఆవ కాయ


మావి పండ్లు తెచ్చి ముక్కలు  కోయించి

         ఉప్పు కారమావ పొడిని కూర్చి

         తైల మందు  కొంత  కాలమ్ము ఊరగా

          వచ్చు  నదియె ఆంధ్ర  ఆవ కాయ



.వరునకు కట్నమ్మొసగుట

    అరయగ ఆచారమగుట అదిఎట్లన్నన్

    విరివిగ కట్నము గైకొని

    మరిమరి యిమ్మనుట   నీతి మాలిన్మ్మౌ





తాటి కాయ ( ముంజి కాయ )


కాయ బయట చూడ గట్టిగా ఉండును

లోన మెత్త నైన  గుజ్జు (గుజురుఉండు

తిన్నవాని కడుపు చల్లగా ఉండును

దీని మరువ కోయి తెలుగు వాడ


దీని సాటి  Ice cream కు కుండు




నీతి పద్యం

కలిమి మనిషి ఎంత కలిగి యున్నను గాని

తృప్తిలేని నాడు రిత్త  కాదె / వృద్ధి లేదు 

తృప్తి  కలిగి మనిషి తృప్తి చెందిన నాడు

పేదయైన  గాని పెద్ద కాదె


నీతి  పద్యం

కలిమి కలిగె నేని కలుగును సౌఖ్యముల్ 

కలిమి లేని నాడు కలుగు వెతలు

కలిగిలేని నాడు   మెలగుము ఒక్కటై

వినుడు నాదు మాట విబుధు  లార



ముద్దబంతి  పూవు ముదిత గుబ్బల బోలు 

కొప్పు లోన పెట్ట గొప్ప గుండు /

విరులలోన  బంతి విరియెంతో వింతయౌ

పూవులందు ' రాణి పూవు ' బంతి



తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు - మధురమాయె పద్య మదియె నాకు.


తేసహజ సహజ గ్రీష్మ  గ్రీష్మ సహజ సహజ


తన్ని ఈడ్చిన ఈడ్చియు తన్నినొకటె

అరయ తన్నీడ్చుటయునొక్కటౌను చూడ

ఈడ్చి ఈడ్చి ఆపై తన్నుటే గుణమవు

దంత విదళనార్ధాశ్మమే దైతె నేమి

8, ఆగస్టు 2023, మంగళవారం


నయనిక 

 తే

శుక్రవారపు  శుభతిథి శోభ కృత్తు /

శ్రవణ మాస మనూరాధ ఋక్ష మందు 

బారువాన్వయమందు వందనాఖ్య/వందన మరి / 

చైతులకు పుత్రి  'నయనికజననమందె .



చైతు వందనలకు సంభవించిన యట్టి 

పాల కడలి పట్టి పోలినట్టి /

నయనికాభిధాన నలిన వదన నకు /

నీశ్వరుండొసంగు నిష్టసిద్ధి .