అమ్మ
ఆ.వె
అమ్మ లేని యింట హాయి లేనే లేదు /
అమ్మ యున్న యింట నన్ని యుండు /
అన్ని చోట్ల బ్రహ్మ అవతరించను లేక /
అమ్మ సృష్టి జేసె నంత బ్రహ్మ .
ఆ.వె
బ్రహ్మ కన్న మిన్న రక్తమిచ్చిన యమ్మ
బ్రహ్మ సృష్టి జేసి వదలి వేయు
పెంచి పెద్ద జేసి విద్య బుద్ధు లు జెప్పు
అమ్మ బ్రహ్మ కంటె నరయ పెద్ద.
ఆ.వె
మూఁడు రెండు సార్లు పుడమి తిరిగినట్లు /
వేయి పదులు కాశి వెళ్ళి నట్లు /
కదిసి నూఱు మార్లు కడలి మునిగినట్లు /
తల్లి కొక్క మాఱు దండ మిడుట .
- కోమలరావు బారువ 9/5/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి