23, జూన్ 2021, బుధవారం

 ఏరువాక సందర్భముగా 

భూమి - రైతు 


.వె 

చినుకు కురవ గానె  సీరమ్ము చేపట్టి/

క్షితి ని దున్నఁ బోవు సేద్య కాడు /

ఏరు తోటి తనదు ఎడద కోసిన గాని /

సిరుల నిచ్చు మనకు ధరణి తల్లి .



.వె 


నింగి లోని మబ్బు నేల కురవగానె /

హలము పట్ట బోవు హాలికుండు /

బలిమి భూమి దున్ని పంటలన్  పండించి /

అన్న మిచ్చు వేల్పు యన్న  దాత .


డాకోమలరావు బారువ   24/6/2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి