కవేరా కు నివాళి బూర్జ మండలంబు తోటవాడ యందు తేజరిల్లిన వాడు చిన్నతనమునందె తెలుగు కవితలు వ్రాయ మరగిన వాడు. వృత్తి యందే కాదు సాహిత్య ప్రవృత్తి యందు పరగు వాడు విమర్శలయందు విశృంఖలుండు వితరణ యందసదృశుడు తెలుగు గ్రంధములు గన్న తప్పక కొని చదివే వాడు . గ్రంధాలయమునే యింట నెలకొల్పినవాడు పద్య మన్నను కొంత మక్కువున్నను కాని వచన కవితలన్న మిగుల యిష్టమ్ము కలవాడు ఆత్మ కథలన్న అఱ్ఱులు చాచే వాడు సాహిత్య సీమలో తన కొక్క గుర్తింపు కలవాడు కవేరా కలం - నిలుచు కల కాలం [21/06, 6:48 AM] Komalarao Baruva: - డా. కోమలరావు బారువ [28/06, 12:26 PM] Komalarao Baruva:
కవేరా కు నివాళి
తేట గీతి మాలిక
కనుగులాన్వయమందున జనన మంది /
శైశవమునుండె సాహిత్య ద్యాస కలిగి /
సత్ప్ర వర్తన కల్గిన సంతుఁ బడసి /
పోస్ట లోద్యోగి యై షష్టి పూర్తి చేసి /
శేష జీవితమ్ము గడిపె చింత లేక/
అతని కంటె ధన్యు డెవరీ యవని యందు /
అతడె పో 'కవేరా' చూడ నమిత యశుడు.
డా. కోమలరావు బారువ ------------------------------------------- అన్వయము = వంశము . సంతు = సంతానము . -------------------------------------------