శ్రీరామ రక్ష
సీస మాలిక
ద్వారపాలకులపై దయచూపుటకునై భువి నవతరించిన విష్ణు వతఁడు/
సృష్టికి ప్రతి సృష్టి చేసిన కౌశికు యాగముఁ గాచినయజ్ఞ భోక్త /
పడతి యహల్య శాపముఁబాపి కరుణతో మోక్షమొసఁగిన పద్మాక్షుఁడతఁడు/
తండ్రి మాట కొఱకు తపసియై రాజ్యముఁ దమ్మున కిడినట్టి త్యాగ ధనుడు /
భక్తులం దున భేదభావమ్ము నరయక గుహుని బ్రోచిన సాధు గుణయుతుండు/
వనచరున్ వాసవిఁ పరిమార్చి భానుజున్ చేపట్టినట్టి సుస్నేహశీలి /
పగతు సోదరుఁ డని పరిమార్చక విభీషణాఖ్యుఁగాచిన కరుణా మయుండు /
ధర్మంబు భువి నిల్ప ధరణిపైవెలసినధర్మరూపుఁడుపరంధాముడతఁడు//
గీ
రాము డనఁగధరణిపైన రహి జనించి/
పుణ్య సుగుణాభి ధాముఁడు మోహనుండు/
దశరథుని పుణ్య ఫలమైన తరణి కులుఁడు/
రాముఁడనయంబు మననెల్ల రక్ష సేయు
... కోమలరావు