21, డిసెంబర్ 2020, సోమవారం

 

పంచదార కన్న !పాల మీగడ కన్న /

జుంటె తేనె కన్నజున్ను కన్న /

పనస తొనల కన్న !పాయసాన్నము కన్న /

తీయ నైన ది మన !తెలుగు భాష .


రచన ?? 



.వె 

పెరుగు వడల కన్న పెసరట్టు కన్నను /

పులుసు పెట్టి నట్టి పులస కన్న

నాటు కోడి కన్న , ఘాటు పచ్చడి కన్న

కమ్మ నైనది మన అమ్మ భాష 


కోమలరావు 28/11/2019

10, డిసెంబర్ 2020, గురువారం

సంస్కృత శ్లోకాలకు అనువాదము 



శ్లో 1

విద్వత్త్వం  నృపత్త్వం  /

నైవతుల్యం కదాచన/

స్వదేశే పూజ్యతే రాజా /

విద్వాన్  సర్వత్ర పూజ్యతే .


గీ

భూ పతికిని పండితునకు బోలిక తగ/

దేల ననరాజు పరికింప దేశ మందె  /

పూజ లందునెల్లప్పుడు పొలుపు మీర/

పుడమి యెల్ల విద్వాంసుఁడు పొగడ బడును


-- కోమలరావు 


శ్లో .2

అతి దానాత్ హతః కర్ణః /

అతి లోభాత్ సుయోధనః /

అతి కామాత్ దశగ్రీవో /

అతి సర్వత్ర వర్జయేత్ .


గీ 

అతి వితరణచే  కర్ణుఁడు చితికి పోయె / 

 రాజ రాజతి  లోభియై రాలి పోయె / 

అమిత కామియై  లంకేశుఁ డంతమొందె

అతిని విడువంగ వలె భువి  నండ్రు బుధులు .


కోమలరావు 1/12/2020


శ్లో 3

ముఖం పద్మ దళాకారం 

వచ శ్చందన శీతలం 

హృదయం కర్తరీ తుల్యం 

*అతి వినయం ధూర్త లక్షణం



ముఖము చూడ పద్మము  వలె నుండుపలుకు

 చంద నమ్ము వలెను  చల్ల గుండు /

కత్తెర వలె నుండు ఖలుని ఎడద చూడ /

దొంగ వినయ శీలి  ధూర్తు డరయ .


శ్లో . 4 


*కృషితో నాస్తి దుర్భిక్షం*

జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి 

నాస్తి జాగరతో భయం 


.వె 


కర్షణమ్ము వలన కరవు పోవు ,  జపము/

వలన పాతకమ్ము పారి పోవు /

మాయ మగు జగడము మౌనమ్ము పాటించ /

నప్ర మత్తునికి భయమ్ము లేదు .


శ్లో . 5 


సిద్ధ మన్నం ఫలం పక్వం

నారీ ప్రథమ యౌవ్వనం

కాలక్షేపం నకర్తవ్యం

*ఆలస్యం అమృతం విషమ్*



గీ .

పండిన ఫలమునుశుచిగా వండిన వరి 

యన్నమునుయౌవనవతి ని ననుభవించ 

తగును వలయు సమయమునందటుల కాక 

యాలసించ నమృతమైన క్ష్వేళ మగును 



శ్లో  


ధనమార్జాయ కాకుత్స్థ

*ధన మూల మిదం జగత్*/

అంతరం నాభి జానామి/

నిర్ధనస్య మృతస్య 


.వె 


ధనము మూల మండ్రు ధరణిలో నరునకు /

ధనము  కూడ బెట్టు  ధర్మముగను /

ధనము మర్మ మెరిగి మరి మనగ వలయు /

విత్త రహితుఁడిలను పీన్గు చువ్వె .


శ్లో .

విశ్వా మాత్రా హి పశుషు, /

కర్ద మేషు జలేషుచ

అంధే తమసి వార్ధక్యే, /

*దండం దశ గుణం భవేత్*.


.వె.   అందమైన వనితఅరుదైన పుస్తకం/

         చేతి సొమ్ము పోతె చేర రావు  /

        మరల వచ్చెనేని  మలినమౌ ముక్కలౌ /

         సగమె  వచ్చు  కాదె జగతి లోన . 


తా పుస్తకముఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల

      తిరిగి రావుఒక వేళ తిరిగి వచ్చిన   చెడి పోయి గానిచినిగి పోయి ,

     సగము గాని వచ్చును

శ్లో .

 నిర్మితో వై నచ దృష్ట పూర్వో

 శ్రూయతే హేమ మయం కురంగ:

తథా2పి తృష్ణా రఘు నందనస్య

*వినాశ కాలే విపరీత బుద్ధి:*


గీ 

చెలియడుగనేలప్రియుఁడు తాఁ చెనటి యై వె /

డలఁగ నేలయిఱ్ఱి కొరకు ; డంబు మీరు /

పసిడి లేడిని కంటిమే? ! ప్రకృతి యందు /

పొలియు  సమయాన విపరీత బుద్ధి కాక .


శ్లో


ఋణ కర్తా పితా శత్రు:

మాతా  వ్యభిచారిణీ

*భార్యా రూపవతీ శత్రు:*

పుత్రశత్రురపండిత


.వె .

త్రివిధ పగఱు నరునకవని యందరయఁగ /

వార కాంతకరణి భంగి  వరలు తల్లి /

అప్పు తప్ప  కొడుకు కాస్తి యివ్వని తండ్రి /

అందమైన భార్య ,  మంద సుతుడు .



శ్లో . 

భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్భూరి విలంబినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణామ్. ( భర్తృహరి/నీతి/62) 


వె 

పండ్ల తోడ నిండి వంగి యుండు తరువు /

నీరు తోడ వంగు కారు మబ్బు /

బుద్ధి కలిగి యున్న బుధుడు వంగు నెపుడు /

తగ్గి యుండు టెపుడు తప్పు కాదు .


(వంగి యుండుటెపుడు వమ్ము కాదు .)




శ్లో 

అర్థాతురాణాం  గురుర్న బంధుః

కామాతురాణాం  భయం  లజ్జా

విద్యాతురాణాం  సుఖం  నిద్రా

క్షుధాతురాణాం  రుచి ర్న పక్వః


తే


అర్థకామికి  గురు బంధులనవసరము /

కామునకు లేవువ్రీడాది కలక లరయ /

చదువరికి లేవు సుఖమును నిదుర ; పుడమిఁ /

బట్టవాకొన్న వానికి పక్వ రుచులు .



-కోమలరావు 

25, అక్టోబర్ 2020, ఆదివారం

 .వె 

భవుని యర్థ మందు వాసమున్న భవాని 

శంభు రాణి దుష్టు శుంభ ఘాతి 

దుర్గు సంహరించి దుర్గాంబ వైతివి 

మమ్ము బ్రోవు మమ్మ మరువకెపుడు  


-- డాకోమలరావు ౨౩/౧౦/౨౦౨౦


26, సెప్టెంబర్ 2020, శనివారం

 


శీర్షిక -  గాన గంధర్వుడు "బాలు


తేటగీతి .


నలుబది పదినూఱు లగు  పాట లవలీల /

పాడి కోట్ల యెడందలఁ బరవశమ్ము /

చేయఁ జాలినట్టి మహిత గాయక మణి /

యస్పి బాలు గంధర్వుఁడ రయఁగ మహిని . 


తేటగీతి .


తెలుగు భాష లోనే కాదు దేశ భాష /

లందు పాడి , యందరి మెప్పు లందు కొన్న 

బాలుయనెడి సుబ్రహ్మణ్య వాణి యీ /  

గాన  వినలేము తత్సముఁ  గనఁగ  లేము 


.. కోమలరావు 






అమర గాయకుడు,



నీ గళానికి గగనమే హద్దు 

నీలాంటి గళము వినటము మరల కద్దు 


నీ పాటంటే ఆంధ్రులకు ముద్దు 

నీ మాటలే అందరికి సుద్దు (లు) = సూక్తులు 


తెలుగు సంగీత సామ్రాజ్యానికి ఏలిక 

నీ వంటి గాయకుడు తెలుగున రాడిక 


సంగీత వినీలాకాశాన నీవు తారక 

 నీ సాటి గాయకుడు మాకు లేడిక 


ఆంధ్రుల అమర గాయకా 

అందుకో మా కన్నీటి నివాళిక 


సెలవు భువి నుండి నీకిక 


--కోమలరావు 25/09/2020