గేయము. రచన. : డా. కోమలరావు బారువ
చూచి వద్దము రండి శ్రీకాకుళం.
ఉత్తరాంధ్రకు మంచి మణి కిరీటం. // చూచి//
1. నాగావళీనదీ నాట్యాలతో .
వంశధార వేణు గానాలతో.
పల్లవించే పంట క్షేత్రాలతో .
పాడి పంటలు కలుగు శ్రీకాకుళం
// చూచి //
2. రుద్ర కోటీశుడు, మల్లిఖార్జునుడు,
ప్రత్యక్ష దైవము అరసవల్లి స్వామి.
కోరికలు తీర్చేటి శ్రీకూర్మనాథుడు.
కొలువు దీరినట్టీ శ్రీకాకుళం // చూచి //
3. అలనాటి గజపతులు ఏలినట్టి నేల.
ముఖలింగేశుని మురిపంపు హేల .
బౌద్ధ వృక్షపు శాఖ పల్లవించిన నేల.
పొందూరు ఖద్దరు పరిఢవిల్లే నేల. //చూచి //
4. ఆట పాటలకు ఆలవాలమీ నేల .
తప్పెట్ల గుళ్ళకు కాణాచి ఈ నేల.
సొగసైన సొంపైన సాగరతీరాలు .
ప్రకృతి అందాలు కలవెన్నొ ఈనేల. // చూచి //
5.
సవర భాషకు పిత గిడుగు నడచిన నేల/
వడ్డాది కలముతో కదంతొక్కిన నేల /
ఉద్దానం బొండాలు మందస హల్వా/
పసందైన పలాస జీడిపప్పు గల నేల.
చూచి వద్దము రండి శ్రీకాకుళం.
ఉత్తరాంధ్రకు మంచి మణి కిరీటం. // చూచి//
1. నాగావళీనదీ నాట్యాలతో .
వంశధార వేణు గానాలతో.
పల్లవించే పంట క్షేత్రాలతో .
పాడి పంటలు కలుగు శ్రీకాకుళం
// చూచి //
2. రుద్ర కోటీశుడు, మల్లిఖార్జునుడు,
ప్రత్యక్ష దైవము అరసవల్లి స్వామి.
కోరికలు తీర్చేటి శ్రీకూర్మనాథుడు.
కొలువు దీరినట్టీ శ్రీకాకుళం // చూచి //
3. అలనాటి గజపతులు ఏలినట్టి నేల.
ముఖలింగేశుని మురిపంపు హేల .
బౌద్ధ వృక్షపు శాఖ పల్లవించిన నేల.
పొందూరు ఖద్దరు పరిఢవిల్లే నేల. //చూచి //
4. ఆట పాటలకు ఆలవాలమీ నేల .
తప్పెట్ల గుళ్ళకు కాణాచి ఈ నేల.
సొగసైన సొంపైన సాగరతీరాలు .
ప్రకృతి అందాలు కలవెన్నొ ఈనేల. // చూచి //
5.
సవర భాషకు పిత గిడుగు నడచిన నేల/
వడ్డాది కలముతో కదంతొక్కిన నేల /
ఉద్దానం బొండాలు మందస హల్వా/
పసందైన పలాస జీడిపప్పు గల నేల.