26, నవంబర్ 2012, సోమవారం


                                కారు -కమామిషు.                                   25/112012 

మనదేశం అభివృద్ధి చెందుతుంది అనడానికి నిదర్శనం గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కారు కొని ఆనందిస్తున్నరు. కారు తో సుఖంతో పాటు కష్టాలు కూడా ఉన్నంటాయని చెప్పె పద్యాలు.



                     కారు -కమామిషు.                                   25/11/2012


తే.గీ.    కాళ్ల ఓపిక తగ్గ నే( కారు కొంటి           (కాళ్ళ లో  పస  తగ్గ  నే కారు  కొంటి )
          సౌఖ్య మెరిగిన కాళ్లేమొ సాగ వాయె
          హెచ్చులకు పోయి ఇక్కట్ట్లు తెచ్చి కొంటి 
          కారు కొని నేను చేతులు కాల్చు కొంటి 


  తే.గీ   రోజు రోజుకు పెరిగెపెట్రోలు  బిల్లు
          పెట్టె నా పేంటు జేబుకు పెద్ద చిల్లు
          ఈఎమై (EMI )కట్ట  బేంకులో  కేషు నిల్లు. ( cash nill)
          కారు కన్న బెటరు కొత్త బైసికిల్లు (bicycle)


ఆ.వె    కార్లు పెరిగిపోయె రోడ్లేమొ  ఇరుకాయె 
          కారు నిలుప చోటు కాన రాదు 
          కారు లో పయనము నత్తకు  ధీటయ్యె
          కాలి  నడక మేలు  కారు కన్న 
          

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి