23, మార్చి 2012, శుక్రవారం
ఉగాది శుభాకాంక్షలు
'నందన ' వసంతం
కం. సమదాళిగూడి అల పై
కము పంచమమాలపించె ,మధురసము గ్రో
లి మధుపము సోలె,మరి కీ
రము పలుకులు ముద్దు గొల్పె ఆమని వేళన్
కం. ఎండలు మండెను అటుపై
ఎండెను గొంతులు జనులకు విరహుల హృదిలో
నిండెను విరహము ,తరువులు
పండెను నందన వన మన నందన రాకన్
కం. అందముగా ఎల్లరకా
నందమ్మొసగన్ పుడమికి 'నందన' వచ్చెన్
నందకధారి కృపారస
మందరకున్దొరకు గాత వత్సర మంతన్.
19, మార్చి 2012, సోమవారం
సచిన్ టెండుల్కర్ కి అభినందనలు
సచిన్ టెండుల్కర్ కి అభినందనలు
ఆ.వె క్రీడ రత్న ,పద్మ విభుషిత ధౌరేయ
సాటి లేని మేటి ' శతక ' వీర
టెండులకర నామ చేకొనుభారత
వంద వందల అభినందనాలు
(వందసెంచరీలు చేసిన సందర్భంగా)
సచిన్ టెండుల్కర్ కి అభినందనలు
ఆ.వె క్రీడ రత్న ,పద్మ విభుషిత ధౌరేయ
సాటి లేని మేటి ' భరత రత్న'
టెండులకర నామ చేకొనుభారత
వంద వందల అభినందనాలు
(భారత రత్న పొందినప్పుడు)
16, మార్చి 2012, శుక్రవారం
అప్పు
కం.
అప్పులు తెచ్చిన తిప్పలు
అప్పరమాత్మునకు దాట తరమా నరుడా
గొప్పలకై పప్పు తినుట
అప్పులలో మునిగి ఉసురుబాయుట కాదే
కం.
అప్పులు తెచ్చిన తిప్పలు
అప్పరమాత్మునకు దాట తరమా నరుడా
గొప్పలకై పప్పు తినుట
అప్పులలో మునిగి ఉసురుబాయుట కాదే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)