విశ్వామిత్రాహి పశుషు కర్డమేషు జలేషు చ
అంధే తమసి వార్దక్యే చ దండం దశ గుణం భవేత్
తా. పక్షి, కుక్క ,శత్రువు ( కాని వాడు , దొంగ ),పాము ,పశువు,బురద ,నీటిలో ,చీకటిలో గ్రుడ్డి వానికి ,ముసలితనము లో ఇలా పది విషయాలలో దండం ఉపయోగకారిని .
వి=పక్షి ,శ్వ= కుక్క ,అమిత్ర = శత్రువు, అహి=పాము , పశుషు=పశువు ,
కర్డమేషు(కర్దమము)=బురద . జలేషు=నీరు , అంధే=గ్రుడ్డి వాడు , తమసి=తమము ,చీకటి , వార్దక్యే=ముసలి తనము
చేతి కర్ర గురించి అందమైన ఆటవెలది
ఆ.వె పాము, వేపి, పిట్ట ,పసుల పారగ దోలు
అంబు ,అడుసు లందు అండ గాను
అహితు ,ముదిమి, అంధ తమములన్ తోడైన
చేతి కర్ర మహిమ చెప్ప తరమె
వేపి =కుక్క , అంబు = నీరు ,అడుసు = బురద ,అహితు =హితుడు కాని వాడు =శత్రువు /దొంగ