17, మార్చి 2026, మంగళవారం

 


 Two Church Builders నకు తెలుగు సేత - డా. కోమలరావు 


తే. 

తొల్లి కీర్తి కాముండను బల్లిదుండు /

రాజ్యమేలుచుండె ప్రజాను రంజకముగ /

అంత  నా నృపతికి మనసు నందు పొడమె/

దేవళమొకటి నిర్మింప దీవ్ర కోర్కె 


తే. 

సప్తసంతానములు కీర్తి సాధకములు /

గాన తత్కీర్తి సొంతము గావలెనని /

ఎవరి సాయముఁ గోరక  యేలికిట్లు /

శాసనము చేసె  నార్థిక సాయమొల్ల /

ననుచు ;  చేసిన శిక్షార్హులగుదురనుచు .


తే. 

కొన్ని నాళ్లకు యొడయని కోర్కె తీరె /

నా  శిలాఫలకము మీఁద నధిపు పేరు 

ప్రజలు చదువు చుండఁగ విని రాజు మురిసి 

పడుచు నిదురించె నా రేయి పడకటింట 


తే 

గాఢ నిద్రలో తానొక్క   కలను గాంచె /

ధవళ వస్త్రములుధరించి దైవదూత /

కానవచ్చి ఫలకమున కల  నరపతి /

పేరు చెరిపి వేరొక్క స్త్రీ.  పేరు వ్రాసె .


తే 

నిద్ర మేల్కాంచి కన్నుల నిప్పులొల్క/

స్వప్న వృత్తాంతమును తన  ప్రగ్గడల కెఱిఁ /

గించి ; ఫలకము పైన లిఖించినట్టి /

వారెవరయిన రహి తెండు వారినిటక/

ని నృపతి యనుజ్ఞ నీయ జనిరి నెమకఁగ 


ఆ.వె 

వెదకి వెదకి వారు విదవరాలొకదాని/

పట్టి తెచ్చి నిల్పె ప్రభుని మ్రోల /

కటము లదరఁగ పటపట పండ్లు కొరకుచు /

పలికె కటువుగ ముదుసలిని  చూచి 


వ. ప్రజల సొమ్ము  నాశించక దేవాలయమును నిర్మించదలఁచి ప్రకటన  చేయఁగ నీవేల నాయాజ్ఞనుల్లంఘించి దానికి సహాయము చేసినావని రాజు గద్దించనపుడా ముదుసలిట్లనియె .


తే. 

పేద నైన నేనేరీతి విత్త మిత్తు ?

మీరు చల్లగుండ ప్రభువు గోరుకొంటి

బడలి యున్న గుఱ్ఱములకు పచ్చికిస్తి 

అదియె కాని మరియొక  తప్పిదములేదు 


వ. అంత రాజు 


తే. 

ముదుసలి పలుకులాలించి యెదను తలచె /

స్వార్ధ బుద్ధితో కట్టించు సౌధమునకు /

నాదు పేరుండుట సబబు కాదనిమది /

నెంచి ముదుసలి పేరును నిర్ణయించె .

 

డా.కోమలరావు . 


*Stanza* ...*1*


A famous king would build a church,

 A temple vast and grand; 

And, that the praise might be his own, 

He gave a strict command 

That none should add the smallest gift 

To aid the work he planned. 


[Vast: Immense or of very great extent]


*Stanza* ...*2* 


And when the mighty dome was done, 

Within the noble frame, 

Upon a tablet broad and fair, 

In letters all aflame 

With burnished gold, the people read

The royal builder's name. 


[Frame: The structure or body of the building.

Tablet: A flat slab of stone or metal, usually fixed to a wall, used for an inscription.

Aflame: Glowing with light or color, as if on fire.

Burnished: Polished by rubbing, usually applied to metal to make it shine.]


Stanza* ...*3*


Now when the King, elate with pride, 

That night had sought his bed, 

He dreamed he saw an angel come 

(A halo round his head), 

Erase the royal name, and write 

Another in its stead. 


[Elate: To be very happy or proud.

Halo: A circle of light shown around the head of a holy person or angel.]


Stanza* ...*4*


What could it mean? Three times that night 

That wondrous vision came; 

Three times he saw that angel hand 

Erase the royal name,

And write a woman's in its stead, 

In letters all aflame. 


[Wondrous: Inspiring a feeling of wonder

in its stead:  instead of it 


 Stanza* ...*5*


Whose could it be? He gave command 

To all about his throne 

To seek the owner of the name 

That on the tablet shone; 

And so, it was the courtiers found

 A widow poor and lone. .. ..Stead:  place once occupied by another]


Stanza* ...*6*


The King, enraged at what he heard, 

Cried, "Bring the culprit here!" 

And to the woman trembling sore

 He said, "'T is very clear 

That you have broken my command; 

Now let the truth appear!"


["trembling sore,":  she was trembling violently or shaking with great fear 

Enraged: Very angry; furious]


Stanza* ...*7*


“Your Majesty," the Widow said, 

"I can't deny the truth; 

I love the Lord, -- my Lord and yours, 

And so, in simple sooth, 

I broke your Majesty's command 

(I crave your royal ruth!) 


[Sooth: An archaic word/poetic word  for "truth"  

Ruth: Pity, regret, or compassion]


Stanza* ...*8*


“And since I had no money, Sire, 

Why, I could only pray 

That God would bless your Majesty; 

And when along the way 

The horses drew the stones, I gave 

To one a wisp of hay!" 


[Sire: A formal and respectful way to address a King.

Wisp: A small thin bunch or bundle.]


Stanza* ...*9*


"Ah! now I see," the King exclaimed, 

"Self-glory was my aim; 

The woman gave for love of God, 

And not for worldly fame; 

'T is my command the tablet bear 

The pious widow's name!"

 

[Self-glory: Praise or honor directed toward oneself.

Worldly fame: Being known or celebrated by other people on earth.]



ప్రఖ్యాతిగాంచిన ఒకానొక రాజు ఒక గొప్ప దేవాలయం (అదే! చర్చి)  నిర్మించాలని అనుకున్నాడు. దానిని నిర్మించడం అనే ఆలోచన సరే… కానీ,  దానిని పూర్తిగా తనడబ్బుతోనే నిర్మించాలి అనుకున్నాడు. దేనికోసము?  కేవలం తనే పేరు సంపాదించాలి అనుకున్నాడు అన్నమాట.


అందుకే ఒక శాసనం చేశాడు.


"దేవాలయ నిర్మాణము  సంబంధించి ఏ విధమైన సహాయము ఎవ్వరూ చేయరాదు .అది  చిన్న gift అయినా సరే చేయరాదు" అని


మరి ఎవరు పని చేయకుండా దేవాలయ నిర్మాణము ఎలా పూర్తవుతుంది. నిర్మాణ కార్మికులకు. నిర్మాణ సిబ్బందికి జీతభత్యములు  ఇస్తున్నాము కదా అని అయి ఉండవచ్చు.


ఏది అయినా పేరు తనకొక్కడికే  రావాలి అని కోరుకోవడం కూడా స్వార్థమే కదా!రాజు చర్చి నిర్మించేది  తన పేరు తన పేరు కోసమే అన్నమాట.


*2* *నిర్మాణం పూర్తి*..*రాజు తృప్తి*


కొంతకాలమునకు  చర్చి నిర్మాణం పూర్తయింది. దానిలో ఒక టాబ్లెట్( అదే శిలాఫలకము). ఆ ఫలకము పై సువర్ణాక్షరాలతో రాజు పేరు లిఖించబడినది.

ప్రజలు చర్చి నిర్మాతగా రాజు పేరు చదవసాగారు. 


ప్రజలు సరే!  మరి  దైవము ఏమి తలచినదో?


*3* *కల కలిగింది-కథ మారింది*


*


ఆనాడు రాజు గర్వముతో నిద్రపోయాడు. నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఒక దేవదూతచే శిలాఫలకం పైనున్న రాజు పేరు చెరిపి వేయబడింది. ఆయన పేరు బదులుగా  ఫలకం పై  మరో పేరు రాయబడింది. *4* *ఏమిటిది కలలో*...


*


రాజుకు ఆశ్చర్యము కలిగింది.?

ఒకసారి కాదు అలా మూడుసార్లు కలవచ్చింది. శిలాఫలకంపై తన పేరు బదులు ఎవరో స్త్రీ పేరు. 


ఒక స్త్రీ పేరు చర్చి నిర్మాతగా వెలిగిపోవటం రాజుకు ఆశ్చర్యం కలిగించింది. *5* *ఆమె ఎవరో కనిపెట్టండి*


*


మేలుకొన్న రాజుకి అసహనం కోపం రగిలి పోయాయి.మనిషి ఊగిపోయాడు. 

రాజు సభచేసాడు.

శిలాఫలకంపై లిఖించబడిన పేరు గల ఆమె తన రాజ్యములో ఎక్కడున్నా వివరములు తెలియచేయవలసినదని ఆజ్ఞ జారిచేసాడు.


రాజుగారు సిబ్బంది ఆమెను కనిపెట్టారు.ఆమె  ఒంటరిగా ఉన్న ఒక విధవరాలు అని. *6* *ఆమెను పట్టి తెండి*


*

ఆమె వివరములు తెలియగానే రాజులో కోపము పెరిగింది. వెంటనే "ఆమెను పెట్టుకోని తెండి" అని ఆజ్ఞజారీచేసాడు. 


ఆమె తీసుకురాబడింది. భయముతో వణికి పోతున్నది.


"నువ్వు నా ఆజ్ఞ మీరావు ఏదో పని చేశావు చెప్పు"  గద్దించాడు రాజు.


*7* *ఆ ఆభాగ్య స్త్రీ ప్రార్థన* 


*


ఆమె "రాజా!  నేను అబద్ధముచెప్పలేను.నేను దైవమును నిన్ను గౌరవిస్తాను ప్రేమిస్తాను" అంటూ..


"నేను నీ అజ్ఞను మీరిన మాటవాస్తవము."  దీనముగా పలికింది. *8* *అసలు ఏం జరిగింది*  

ఆమె ఇంకా ఇలా అంటున్నది," రాజా నేను నిరుపేదను. చర్చి కట్టిస్తున్న నిన్ను దేవుడు చల్లగా చూడాలని ప్రార్థన చేయటమే తెలిసిన దానిని. 

కానైతే చర్చి నిర్మాణసమయములో  రాళ్లను తీసుకొనివచ్చు  బండిని లాగుతున్న గుఱ్ఱములకు ఆహారముగా కొంత మేతను నేను ఇచ్చిన మాట వాస్తవము.


*9* *రాజుకు కనువిప్పు(అదే .. జ్ఞానోదయం)*  


ఆమె  మాటలు విన్న రాజు చలించి  పోయాడు. ఈసారి కోపంతో కాదు. రియలైజేషన్ తో.

అతడు అనుకున్నాడిలా," అవును నేను చేసిన పని కీర్తి కోసం. ఈమె చేసినపని అందుకు  కాదు భగవంతునిపై నిజమైన ప్రేమతో. 

వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. "ఈ పవిత్రమైన ఈ శిలాఫలకముపై పవిత్రురాలైన ఈమె పేరే ఉండాలి"