25, ఫిబ్రవరి 2026, బుధవారం

 శ్లో .


మనో మధుకరో మేఘో మద్యపో మత్కుణో మరుత్ | 

మా మదో మార్కటో మత్స్యో మకార దశ చంచలాః ||


తే. 

మనసు మధుపమ్ము మేఘమ్ము మారుతమ్ము /

మర్కట మధిర మత్తుఁడు మత్స్య మత్కుణమ్ము /

మదయుతుండు  మాలచ్చిమి పదియు ' మా ' లు /

చంచలమ్ములు పరికింప జగతి యందు .

2, ఫిబ్రవరి 2026, సోమవారం

 మత్స్య కార ఇంటిపేర్లు 

సీసము 

అలిపల్లి అంబటి అర్జాల సిడిపల్లి 

           సుంకర కుడతాల చోడిపల్లి  /

అకుపల్లి బైపల్లి  చుకపల్లి బారువ  

           వారాది  దాసరి వాసిపల్లి/

 చింతకాయల తయ్య చిడమాన రాయతి 

             చీకటి గంధము,చింతపల్లి /

పువ్వుల, పుక్కల్ల , బొమనాట మేరుగు 

           మూగి జోగి య వంక మాగుపల్లి /

తోలాడ ,తోలాన , దుమ్ము బడె గనగళ్ళ 

           సురాడ కోనాడ లండ కుందు /

ఆ.వె 

పప్పు మైలపల్లి పల్లేటి చొక్కర /

ఇద్ది కారె పేర్ల , తిత్తి మోస /

వంటి పేర్లు వారి ఇంటిపేర్లుగ కల్గి /

వసుధ మత్స్య కార్లు  వరలుచుంద్రు 


డా.కోమలరావు