30, జనవరి 2026, శుక్రవారం

 భీష్మ నుతి 

సీ. 

గోవును హింసించ కోపించు ఊర్వశి 

     పుత్రుని శాపంబు   పొందెనెవఁ డు/

శంతన జాహ్నవి సంతానమైపుట్టి 

     జామదగ్ని కి ప్రియ చాత్రు డెవఁ డు/

 తండ్రికయి తన  ఉద్వహమును విడనాడి 

       బ్రహ్మ చర్యమెవడు ప్రతిన చేసె/

పదిదినముల్ ఘోర పవరమ్ముసల్పుచు 

        యుద్ధమ్మున పడిన యోద్ధ యెవఁడు //


గీ. 

అట్టి గాంగేయు కురువృద్ధు నాహవమున /

ప్రళయకాల కాలాంతకు భక్తులందు /

శ్రేష్ఠు వసువులందు కనిష్ఠు చేతు లెత్తి /

ప్రార్ధన మొనరింతున్ భీష్ము భక్తి తోడ .


కోమలరావు 

 


మీ మనువరాలికి 


ఆ.వె 

సంహితాప్రణవు ల సంయోగ ఫలితమ్ము /

పాల కడలి పట్టి పోలినట్టి /

మిహిర నామ పూర్ణ మిహికాంశు సదృశకు (వదనకు )

నీశ్వరుండొసంగు నిష్టసిద్ధి .




చైతు వందనలకు సంభవించిన యట్టి 

పాల కడలి పట్టి పోలినట్టి /

నయనికాభిధాన నలినాస్య బాలకు /నలిన వదనకు /

ఈశ్వరుండొసంగు నిష్టసిద్ధి .


 సరసిజ వైరివైరులనుచక్కగగెల్చు కుచద్వయంబుతో /

సరసిజ వైరి వైరినగజాలిన మేలగు మధ్యమంబుతో /

సరసిజ వైరి వైరి నెకసెక్కెములాడెడు కప్పుకొప్పుతో /

సరసిజగంధి వచ్చె మరుసాయకమోయన సుబ్బయాఖ్యయా  

  అంశము : తెలుగు  వెలుగు - పద్య రచన 


ఆ.వె 

ఆవు దూడ యరచు నంబ యంబాయని /

కాకి యరచు  కావు కావనుచును /

అమ్మనమ్మ యనక మమ్మి మమ్మి యనెడి /

తెగులు సోకెనిపుడు తెలుగు ప్రజకు .

ఆ.వె 

డాడ డీలు వచ్చు డాగుణింతమునందు /

'డాడి' పిలుపు కేడి బీడి బోలు /

'నాన్న'   పిలుపు పాయసాన్న మువలె నుండు /

తెలుగు భాష  తీపి తెలియ తరమె .


తే. 

అమ్మ భాషను  మాట్లాడినపుడు ,మాతృ /

భాష నేర్చుకొని  సరిగ వ్రాయగలిగి/

ఆంగ్ల పదముల నరుదుగా ననుకరించ /

తెలుగు భాష అజస్రము నిలుచు  గాదె !


సీ. 

నన్నయ్య కాలాన  నాట్యమాడిన భాష 

      తిక్కయ్య కలములో  తేజరిల్లి /


ఎర్రనామాత్యుని కృతు లందతిశయించి 

         నాచన సోముని నాల్క నిలచి /

                   

శ్రీనాథు సీసాల చెలగి యూయలలూగి 

          పోతన్న గళములో ప్రోదికెక్కి /


త్యాగయ్య అన్నమయ్య పదములందున 

             రసభావతాళముల్ రహి వహించ //

తే . 

కృష్ణ రాయల కాలాన కీర్తి కెక్కి /

దేశభాషలందు తెలుగు తేజమొప్ప/

తెలుగు భాష నిలిచియుండు తెలుగు నేల /

ఉడుపథిని సూర్యచంద్రాదులుండువరకు .



--------------


డా. కోమలరావు 

9440955483

శ్రీకాకుళము 


 


రథ సప్తమి 


తే. 

చక్ర మొక్కటి కలిగిన స్యందనమ్ము /

(బండికన్నొకటి  కలుగు   బండి  మీఁద )

గాలి భుజియించు ఫణులు పగ్గములు గాగ/

జవము గల ఘనమగు సప్త  సప్తి తోడ 

నడవ లేని వాడు రథము నడుపు చుండ /

వాలకిల్యాది మౌనులు ప్రస్తుతించ 

చదల తిరిగెడు తొగదాయ (కాశ్యపున్ )సంస్తుతింతు /

నలిన భాంధవు సూర్యు జన్మ దినమందు.


-------


స్యందనము = రథము .

జవము = వేగము .

సప్తి = గుఱ్ఱము .

నడువలేని వాడు - కాళ్ళు లేని వాఁడు ( అనూరుఁడు) 

చదలు = ఆకాశము .


హర్షవల్లి 


ఆ.వె 

మూడు వేళలందు మూడు వేల్పులబోలి /

మూడుకాలములకు మూలమైన /

కర్మసాక్షి యినుఁడు  కంజాత్మబంధుఁ డు /

కరుణ తోడ మనల  కాచు గాక .


తాత్పర్యము 


ఉదయము బ్రహ్మ , మధ్యాహ్నము శివుడు ,సాయంకాలము విష్ణు రూపుడై , ఎండకాలము,,వర్ష కాలము, చలికాలములకు కారణమైన కర్మసాక్షి , పద్మబంధుడు సూర్యుడు మనలనందఱను రక్షించుగాక. 


రథసప్తమి శుభాకాంక్షలు 


తే.గీ 


ఒంటి చక్రపు రథములో మింట దిరుగు /

దేవు వాసమ్ము పుణ్య నాగావళి దరి /

తలచు వారికి నారోగ్య దాయకంబు /

ఆ దివాకరు క్షేత్రమ్ము  హర్ష వల్లి .


----------


డా.కోమలరావు 


రథ సప్తమి విశిష్ఠత 


సూర్య భగవానుడు -అదితి కశ్యపుల సంతానము - పోషకుడైన విష్ణు మూర్తి అంశము ప్రత్యక్ష దైవము .మాఘ సప్తమి నాడు జననము .మార్తాండుడు 


సంవత్సర కాలములో సూర్యుడు -12 రాశులలో సంచరించును .మేషము నుండి మీనము ( పండ్రెండ్రు పేర్లు  ధాత 2. మిత్రుడు 3. ఆర్యముడు 4. శక్రుడు/ఇంద్రుడు5. వరుణుడు 

6. అంశుడు/అంశ 7. భగుడు 8. వివస్వంతుడు9. పూష/పూషనుడు10. సవిత/పర్జన్యుడు 11. త్వష్ట 12. విష్ణువు )


రేపకడ లేచి అర్క బదరీ ఫల స్నానము -మజ్జన మాచరించి ,


వేద స్వరూపుడు - త్రయీ వేది - జ్ఞాన ప్రధాత 

జయ ప్రధాత - రామరావణ యుద్ధము .

అన్న ప్రధాత- అక్షయ పాత్ర 

ఆరోగ్య ప్రధాత - సాంబుడు 

ఐశ్వర్య ప్రధాత - సత్రాజిత్ 


శ్లో .

రథ స్యైకం చక్రం భుజగ యమితాః సప్త తురగాః|

నిరాలంబో మార్గ శ్చరణ రహితః సారథి రపి|

రవి ర్గచ్ఛ త్యంతం ప్రతిదిన మపారస్య నభసః

క్రియా సిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే .


తే. 

ఒంటి చక్ర రథము  , పిచ్చు కుంటు రౌతు 

గాలి మేపరి పగ్గాలు , గగన మార్గ /

మందు సప్తాశ్వ రూఢుడై యనుదినంబు /

సంచరించు జగము మేలు నెంచి యినుఁడు .