శ్లో .
మనో మధుకరో మేఘో మద్యపో మత్కుణో మరుత్ |
మా మదో మార్కటో మత్స్యో మకార దశ చంచలాః ||
తే.
మనసు మధుపమ్ము మేఘమ్ము మారుతమ్ము /
మర్కట మధిర మత్తుఁడు మత్స్య మత్కుణమ్ము /
మదయుతుండు మాలచ్చిమి పదియు ' మా ' లు /
చంచలమ్ములు పరికింప జగతి యందు .
శ్లో .
మనో మధుకరో మేఘో మద్యపో మత్కుణో మరుత్ |
మా మదో మార్కటో మత్స్యో మకార దశ చంచలాః ||
తే.
మనసు మధుపమ్ము మేఘమ్ము మారుతమ్ము /
మర్కట మధిర మత్తుఁడు మత్స్య మత్కుణమ్ము /
మదయుతుండు మాలచ్చిమి పదియు ' మా ' లు /
చంచలమ్ములు పరికింప జగతి యందు .
మత్స్య కార ఇంటిపేర్లు
సీసము
అలిపల్లి అంబటి అర్జాల సిడిపల్లి
సుంకర కుడతాల చోడిపల్లి /
అకుపల్లి బైపల్లి చుకపల్లి బారువ
వారాది దాసరి వాసిపల్లి/
చింతకాయల తయ్య చిడమాన రాయతి
చీకటి గంధము,చింతపల్లి /
పువ్వుల, పుక్కల్ల , బొమనాట మేరుగు
మూగి జోగి య వంక మాగుపల్లి /
తోలాడ ,తోలాన , దుమ్ము బడె గనగళ్ళ
సురాడ కోనాడ లండ కుందు /
ఆ.వె
పప్పు మైలపల్లి పల్లేటి చొక్కర /
ఇద్ది కారె పేర్ల , తిత్తి మోస /
వంటి పేర్లు వారి ఇంటిపేర్లుగ కల్గి /
వసుధ మత్స్య కార్లు వరలుచుంద్రు
డా.కోమలరావు
భీష్మ నుతి
సీ.
గోవును హింసించ కోపించు ఊర్వశి
పుత్రుని శాపంబు పొందెనెవఁ డు/
శంతన జాహ్నవి సంతానమైపుట్టి
జామదగ్ని కి ప్రియ చాత్రు డెవఁ డు/
తండ్రికయి తన ఉద్వహమును విడనాడి
బ్రహ్మ చర్యమెవడు ప్రతిన చేసె/
పదిదినముల్ ఘోర పవరమ్ముసల్పుచు
యుద్ధమ్మున పడిన యోద్ధ యెవఁడు //
గీ.
అట్టి గాంగేయు కురువృద్ధు నాహవమున /
ప్రళయకాల కాలాంతకు భక్తులందు /
శ్రేష్ఠు వసువులందు కనిష్ఠు చేతు లెత్తి /
ప్రార్ధన మొనరింతున్ భీష్ము భక్తి తోడ .
కోమలరావు
మీ మనువరాలికి
ఆ.వె
సంహితాప్రణవు ల సంయోగ ఫలితమ్ము /
పాల కడలి పట్టి పోలినట్టి /
మిహిర నామ పూర్ణ మిహికాంశు సదృశకు (వదనకు )
నీశ్వరుండొసంగు నిష్టసిద్ధి .
చైతు వందనలకు సంభవించిన యట్టి
పాల కడలి పట్టి పోలినట్టి /
నయనికాభిధాన నలినాస్య బాలకు /నలిన వదనకు /
ఈశ్వరుండొసంగు నిష్టసిద్ధి .
సరసిజ వైరివైరులనుచక్కగగెల్చు కుచద్వయంబుతో /
సరసిజ వైరి వైరినగజాలిన మేలగు మధ్యమంబుతో /
సరసిజ వైరి వైరి నెకసెక్కెములాడెడు కప్పుకొప్పుతో /
సరసిజగంధి వచ్చె మరుసాయకమోయన సుబ్బయాఖ్యయా
అంశము : తెలుగు వెలుగు - పద్య రచన
ఆ.వె
ఆవు దూడ యరచు నంబ యంబాయని /
కాకి యరచు కావు కావనుచును /
అమ్మనమ్మ యనక మమ్మి మమ్మి యనెడి /
తెగులు సోకెనిపుడు తెలుగు ప్రజకు .
ఆ.వె
డాడ డీలు వచ్చు డాగుణింతమునందు /
'డాడి' పిలుపు కేడి బీడి బోలు /
'నాన్న' పిలుపు పాయసాన్న మువలె నుండు /
తెలుగు భాష తీపి తెలియ తరమె .
తే.
అమ్మ భాషను మాట్లాడినపుడు ,మాతృ /
భాష నేర్చుకొని సరిగ వ్రాయగలిగి/
ఆంగ్ల పదముల నరుదుగా ననుకరించ /
తెలుగు భాష అజస్రము నిలుచు గాదె !
సీ.
నన్నయ్య కాలాన నాట్యమాడిన భాష
తిక్కయ్య కలములో తేజరిల్లి /
ఎర్రనామాత్యుని కృతు లందతిశయించి
నాచన సోముని నాల్క నిలచి /
శ్రీనాథు సీసాల చెలగి యూయలలూగి
పోతన్న గళములో ప్రోదికెక్కి /
త్యాగయ్య అన్నమయ్య పదములందున
రసభావతాళముల్ రహి వహించ //
తే .
కృష్ణ రాయల కాలాన కీర్తి కెక్కి /
దేశభాషలందు తెలుగు తేజమొప్ప/
తెలుగు భాష నిలిచియుండు తెలుగు నేల /
ఉడుపథిని సూర్యచంద్రాదులుండువరకు .
--------------
డా. కోమలరావు
శ్రీకాకుళము
రథ సప్తమి
తే.
చక్ర మొక్కటి కలిగిన స్యందనమ్ము /
(బండికన్నొకటి కలుగు బండి మీఁద )
గాలి భుజియించు ఫణులు పగ్గములు గాగ/
జవము గల ఘనమగు సప్త సప్తి తోడ
నడవ లేని వాడు రథము నడుపు చుండ /
వాలకిల్యాది మౌనులు ప్రస్తుతించ
చదల తిరిగెడు తొగదాయ (కాశ్యపున్ )సంస్తుతింతు /
నలిన భాంధవు సూర్యు జన్మ దినమందు.
-------
స్యందనము = రథము .
జవము = వేగము .
సప్తి = గుఱ్ఱము .
నడువలేని వాడు - కాళ్ళు లేని వాఁడు ( అనూరుఁడు)
చదలు = ఆకాశము .
హర్షవల్లి
ఆ.వె
మూడు వేళలందు మూడు వేల్పులబోలి /
మూడుకాలములకు మూలమైన /
కర్మసాక్షి యినుఁడు కంజాత్మబంధుఁ డు /
కరుణ తోడ మనల కాచు గాక .
తాత్పర్యము
ఉదయము బ్రహ్మ , మధ్యాహ్నము శివుడు ,సాయంకాలము విష్ణు రూపుడై , ఎండకాలము,,వర్ష కాలము, చలికాలములకు కారణమైన కర్మసాక్షి , పద్మబంధుడు సూర్యుడు మనలనందఱను రక్షించుగాక.
రథసప్తమి శుభాకాంక్షలు
తే.గీ
ఒంటి చక్రపు రథములో మింట దిరుగు /
దేవు వాసమ్ము పుణ్య నాగావళి దరి /
తలచు వారికి నారోగ్య దాయకంబు /
ఆ దివాకరు క్షేత్రమ్ము హర్ష వల్లి .
----------
డా.కోమలరావు
రథ సప్తమి విశిష్ఠత
సూర్య భగవానుడు -అదితి కశ్యపుల సంతానము - పోషకుడైన విష్ణు మూర్తి అంశము ప్రత్యక్ష దైవము .మాఘ సప్తమి నాడు జననము .మార్తాండుడు
సంవత్సర కాలములో సూర్యుడు -12 రాశులలో సంచరించును .మేషము నుండి మీనము ( పండ్రెండ్రు పేర్లు • ధాత 2. మిత్రుడు 3. ఆర్యముడు 4. శక్రుడు/ఇంద్రుడు5. వరుణుడు
6. అంశుడు/అంశ 7. భగుడు 8. వివస్వంతుడు9. పూష/పూషనుడు10. సవిత/పర్జన్యుడు 11. త్వష్ట 12. విష్ణువు )
రేపకడ లేచి అర్క బదరీ ఫల స్నానము -మజ్జన మాచరించి ,
వేద స్వరూపుడు - త్రయీ వేది - జ్ఞాన ప్రధాత
జయ ప్రధాత - రామరావణ యుద్ధము .
అన్న ప్రధాత- అక్షయ పాత్ర
ఆరోగ్య ప్రధాత - సాంబుడు
ఐశ్వర్య ప్రధాత - సత్రాజిత్
శ్లో .
రథ స్యైకం చక్రం భుజగ యమితాః సప్త తురగాః|
నిరాలంబో మార్గ శ్చరణ రహితః సారథి రపి|
రవి ర్గచ్ఛ త్యంతం ప్రతిదిన మపారస్య నభసః
క్రియా సిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే .
తే.
ఒంటి చక్ర రథము , పిచ్చు కుంటు రౌతు
గాలి మేపరి పగ్గాలు , గగన మార్గ /
మందు సప్తాశ్వ రూఢుడై యనుదినంబు /
సంచరించు జగము మేలు నెంచి యినుఁడు .