11, ఏప్రిల్ 2023, మంగళవారం

 తే


వానర వధూవర ఘన వి వాహ వేళ /

వానర తతికిఁబ్రియమగు పంక్తి భోజ /

నంబు వెట్ట వానర సమూహంబు నియతి /

చూడ నెంతయు కనులకు చోద్య మయ్యె .


డాకోమలరావు 

10, ఏప్రిల్ 2023, సోమవారం

 తెలుగు భాష 

తెలుగు పదము పలుక తెగువ చూపని నాడు /

తెలుగు బ్రతుకు నెటుల తెలుగు నేల /

తెలుగు పదము కంటె తీపి పదము లేదు /

తెలుగు పలికి తెలుగు విలువ నిలుపు .


వె 

అంద మైన పదములాంధ్రమ్మునందుండ /

ఆంగ్ల పదము లకయి అరయ నేల/

ఆంగ్ల భాష యన్న ఆరాటమదియేల /

ఆంధ్ర భాష యన్న నలుకయేల


కోమలరావు )