10, మార్చి 2023, శుక్రవారం


డా.కోమలరావు బారువ 


వసంత ఋతువు - శోభకృత్ సంవత్సరమునకు  స్వాగతము 


తే


 ఋతువు మార్పు  మనకు ప్రకృతి తెలిపె నన /

క్రొత్త చిగురు తిని పికము రుతము చేసె /

కుజములన్నియు పూసెను కుసుమములను /

తేటి బృందముల్ రొదచేసె తేనె గ్రోలి 


తే

వేడి గాడ్పులు పవలందు వీవ దొడఁగె /

పగలు పెరిగెను రేలు తరిగెను చూడ /

బొండు మల్లెలు తీగెల నిండుకొనియె /

మనసు కాహ్లాదమిడు మధు మాసమరయ .


తే


ప్రజల వెతలను ఆకుల  రాలజేసి /

పాడి పంటల నిచ్చి శుభములొసంగి /

ఆయురారోగ్య ముల నిచ్చి హాయి గొల్పు/

వత్సరము *శోభకృత్నకు స్వాగతమ్ము .



ఉగాది 


.వె 

చైత్రమాది దినము చిత్రమైన దినము /

బ్రహ్మ సృష్టికదియె  ప్రధమ దినము /

వేద తతిని మరల వేధ కిచ్చిన రోజు / 

కరము శుభ కరము ; యుగాది రోజు 



.వె 

చేదు తీపి వగరు చింత పండు పులుపు /

కారముప్పు సరిగ కలిపి  చేసి /

నట్టి షడ్రుచులుగలట్టి పచ్చడిని సే /

వింతు రంద రు బహు ప్రీతి తోడ .


----------

గమనికఇది నా స్వంత రచన 

Disclaimer: The above writting is my own .