ఆంధ్ర వైద్య కళాశాల 1978 సింహావలోకనము
గుర్తుకొస్తునాయి గుర్తుకొస్తునాయి
ఇన్నేళ్ళుగా
నా గుండె లో
దాగున్న ఙ్ణాపకాలు
నిద్ర లేస్తున్నయి
అనాటమీ లో శవాల కంపు
బ్రేక్ టైము లో సమోస ఇంపు . ‘ బారి’ సమోస ఇంపు. _ గుర్తుకొస్తునాయి
ఫిజియో క్లాసులో కప్పల బెక బెక
'రెడ్డి 'క్లాసులో నవ్వుల పకపక –ఏ య్ మిస్టర్ తోల్ ద క్రోస్. ( crows ) -గుర్తుకొస్తునాయి
బయో కెమిస్ట్రీలో 'బైసెప్స్ 'తో కుస్తీ
ఫార్మాలో 'నిర్మా' తో ఉతుకు. -గుర్తుకొస్తునాయి
ఎండా డ లో పిక్నిక్ సందడి
అంతలోనే పరీక్షల హడావిడి
లేబర్ రూము లో నర్సులతో రణం
కోర్సు మద్యలో మిత్రుని మరణం -గుర్తుకొస్తునాయి
సాగర్ పయనం చేసొచ్చాము
అన్నవరమ్ము చూసాము
ఫైనలియర్ లో చదువుల పోటి
ఐనా స్నేహం లో మేమే సాటి - మాకు మేమే సాటి గుర్తు ‘’
రచన : బారువ కోమలరావు
శ్రీకాకుళం
-------------------------