ఆ.
అమ్మ ,చెల్లి, యాలి, అక్క యౌ మగువను /
మనిషి మరువ రాదు మనమునందు /
శక్తి వోలె యింట సకల రూపములెత్తు /
ఆది శక్తి యతివ యరసి చూడ.
డా. కోమలరావు
ఆ.
అమ్మ ,చెల్లి, యాలి, అక్క యౌ మగువను /
మనిషి మరువ రాదు మనమునందు /
శక్తి వోలె యింట సకల రూపములెత్తు /
ఆది శక్తి యతివ యరసి చూడ.
డా. కోమలరావు
రష్యా పై యుక్రెయిన్ సాహసము
తే.
తన బలమెరిగి తలపడ తప్పుకాదు /
ఎదిరి శక్తి నరసి పోరు టెందు నీతి /
పరుల మాట నమ్మి పగర పై కరుగట /
పాడి కాదు ప్రపంచాన ప్రభువు కెపుడు .
తే.
*కర్ణు* బలముజూచియ కాదె *కౌరవాగ్ర*
జుండు తొల్లి రణములోన పాండు సుతుల
పోరె ; నవ్విధి *జెలనస్కి* పోరె నేడు
రష్య తోడ *వెస్టు* బలము లావు జూచి
-డా. కోమలరావు 19/3/2022
-డా. కోమలరావు 8/2/2022
భార్య
ఆ.వె
భార్య భారమనుచు భావించకెప్పుడు/
కష్ట సుఖము లందు కలసి యుండు /
విధి యొసంగి నట్టి ప్రియ వయస్య పతికి /
ఆధి వ్యాధు లందు నౌషధంబు.
డా. కోమలరావు బారువ 11/9/2021