తేట గీతి మాలిక
ధారుణీచక్ర మురు తర తేరు కాగ /
వేల్పు కొండయె వ్రేగైన విల్లు కాగ /
ఆగమంబులు తేరికి హరులు గాగ /
నాగరాజు శేషుఁడు వింటి నారి కాగ /
శౌరి శత్రు నిర్దళనమౌ శరము కాగ /
వనజ భవుఁడుతాఁ సూతుఁడై వర్తిలంగ /
చెలగి త్రిపురాసురుల నీఱు చేసి నట్టి /
శంభు శాంకరీ వల్లభు సంస్తుతింతు .
-కోమలరావు బారువ
లింగోద్భవము
తే.
నేన యధికుండ మూలంబ నేన యనుచు /
హరి విరించులు కలహించ నహము తోడ /
కండ్లు మిరుమిట్లు గొలుపంగ కాంతులొల్క /
లింగమొక్కటి వెలసె వారిర్వురి కడ .