వ్యాసుడు / కుప్పా వేంకట కృష్ణమూర్తి -24/7/2021
సీ.
విజ్ఞాన గోళాన్ని విలువైన నిలువైన వ్యాస రేఖా దీప్తి వ్యాస మౌని /
విజ్ఞాన రాశిని వివిధతన్ విపులతన్ పరచి యిచ్చిన దాత వ్యాస మౌని /
విజ్ఞాన సస్యముల్ విపుల భారత భూమి పనసలోదెలఁబంచె వ్యాసమౌని /
విజ్ఞాన కేంద్రముల్ వెదకి దేశంబెల్ల ప్రమ్మె విద్యా నేత వ్యాసమౌని //
తే.గీ
భవ్య విజ్ఞానమనెడి రూపాయి బిళ్ళ/
కెన యు బొరుసుయు బొమ్మయు యెవ్వరౌదు/
రట్టి వ్యాసుని కృష్ణునవ్యాజ భక్తి /
మ్రొక్కు డీ వ్యాసపూర్ణిమఁ బూర్ణతకయి.