శీర్షిక - గాన గంధర్వుడు "బాలు"
తేటగీతి .
నలుబది పదినూఱు లగు పాట లవలీల /
పాడి కోట్ల యెడందలఁ బరవశమ్ము /
చేయఁ జాలినట్టి మహిత గాయక మణి /
యస్పి బాలు గంధర్వుఁడ రయఁగ మహిని .
తేటగీతి .
తెలుగు భాష లోనే కాదు దేశ భాష /
లందు పాడి , యందరి మెప్పు లందు కొన్న
బాలు' యనెడి సుబ్రహ్మణ్య వాణి యీ జ/
గాన వినలేము తత్సముఁ గనఁగ లేము
.. కోమలరావు
అమర గాయకుడు,
నీ గళానికి గగనమే హద్దు
నీలాంటి గళము వినటము మరల కద్దు
నీ పాటంటే ఆంధ్రులకు ముద్దు
నీ మాటలే అందరికి సుద్దు (లు) = సూక్తులు
తెలుగు సంగీత సామ్రాజ్యానికి ఏలిక
నీ వంటి గాయకుడు తెలుగున రాడిక
సంగీత వినీలాకాశాన నీవు తారక
నీ సాటి గాయకుడు మాకు లేడిక
ఆంధ్రుల అమర గాయకా
అందుకో మా కన్నీటి నివాళిక
సెలవు భువి నుండి నీకిక
--కోమలరావు 25/09/2020