21, నవంబర్ 2016, సోమవారం


Modi governments  demonetisation    21/11/2016


దేశం లో నల్ల ధనం పెరిగిపోయింది . ఎలా అని మోడి ఇలా అనుకుంటున్నాడట .


ఆ.వె   వీధిలోని చెత్త చీపురు తో పోవు

            సబ్బు నీట పోవు షర్టు మురికి

           నల్ల ధనము ఎట్లు నాశమ్ము ఔనురా

           పెద్ద నోట్లు  రద్దు  కద్దు సుమ్ము

కద్దు = సబబు , సరి

పెద్ద నోట్లు రద్దైన తరువాతి పరిణామములు

ఆ. వె .నల్ల ధనము మగిడి వెల్లనౌ టెటులని
          వివిధ మార్గములను    వెదుకు నొకడు
         చిల్లరున్న చాలు  చేతికి నిండుగా    
         పుడమి గెలిచి నటులు మురియు నొకడు


మగిడి = మరల ,వెల్ల= తెలుపు