14, సెప్టెంబర్ 2016, బుధవారం

సర్ప పుర మాహాత్మ్యము - కూచిమంచి తిమ్మన

చ. కుడుములు చాల మెక్కి ,క!లుగుం లాయపు తేజి నెక్కి,ప్రా
     నుడువుల వన్నెకెక్కి, మహి!నూల్కొను విఘ్నములెల్ల జెక్కి య.    
    య్యుడుపతి మౌళి పాదముల!కున్నత భక్తిని మ్రొక్కి భక్తులన్
    విడువక ప్రోచు భవ్య మతి !విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్

( సముక వెంకట కిష్టప్ప విరచిత " అహల్యా సంక్రందనము " )
------------


సర్ప పుర మాహాత్మ్యము - కూచిమంచి తిమ్మన
కూచిమంచితిమ్మన 17-18. శతాబ్దము వాడు.
పిఠాపురం సంస్థానంలో నీలాద్రి మాధవరాయని కాలం వాడు
గురువు :  దెందులూరి లింగనారాధ్యుడు.  
శివ భక్తుడు
కందరాడ. కరణం

ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తాత. తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

ఇలాంటి కథ దేవీ భాగవతం లో ఉన్నది.

బ్రహ్మ వైవర్తపురాణం నుంచి గ్రహించడం బడినది.

ప్రేరణ - కల.

భావనారాయణుడు కలలో కన్పించి సర్ప పుర మహాత్మ్యము రచన చేసి నాకు అంకితమిమ్మని చెప్తాడు .
ఇష్ట దేవత స్తుతి తో ప్రారంభించి సర్ప పుర మాహాత్మ్యము రచన చేస్తాడు.
9+13+10=32
��ప్రధమాశ్వాసము

పూర్వము అంబరీషుడనే చక్రవర్తి పరిపాలిస్తూ  ఉండేవాడు.ఒక రోజు రాజు కొలువు తీరి యుండగా కుల గురువు వశిష్టుడు రావడం తటస్థిస్తుంది.


సీ. అరయంగ సర్ప పురాఖ్యాన మెట్టిది , భావనారాయణ దేవుడచట
     నేమిటి కుదయించి యిల నున్న వాడు , తద్దేవునెవ్వాడు ప్రతిష్ట చేసె
    నందులఁ గల్గు పుణ్య సరోవరము లెవ్వి, యత్తీర్థములఁ గ్రుంకులాడి నట్టి
    ఫలమది యెట్టిది ప్రాచుర్యముగ  నిది, విన డెందమునఁజాల వేడ్కయెదవె

     నీ సమస్తము తెలియ నా కెఱుగఁజెప్ప
    వలయు నని వేడు కొనిన నవ్వసుమతీశుఁ
    గాంచి ముని మౌళి నెయ్యంబు గడలుకొనఁగ
   నలర వినుమని యిట్లని దెలుప దొడఁగె

నైమిశారణ్యము,        గోమతి నదీ తీరాన   ,     శౌనకుడు

బ్రహ్మ తేజుముతో నొప్పు అగస్త్యుని. రాక

వింధ్యమథిత్యకా కటక విస్ఫుట పాదప పుష్పగుచ్ఛ సౌ
గంధ్యము హేమధాతు మయ కల్పిత సంద్యము బద్ధ మేరు సా
గంధ్యము చండకేసరి నికాయ నిరాకృత భద్ర దంతి ద
ర్పాంధ్యము ఁ గుంకఁదొక్కితి మహా గుణ భూషణ సత్య భాషణా

మహాత్మా  విశ్వేశ్వరుండు ను విశ్వయోనియు విశ్వస్రష్టయు జగత్ప్రుభుండును ననాది నిధనుండును శ్రీమంతుండును భగవంతుండును నగు పురుషోత్తముండు సర్వ గతుండై యుండియు బ్రణామార్చనాది విధంబుల నచటనచ్చట గోచరుండై యుండియు ప్రతిష్టాపనా మాహాత్మ్యంబునక్షేత్ర ప్రభావంబున నర్చక ప్రీతివశంబునఁ బూజాదికృత్యంబున సాక్షత్కారుడగుచుండునని  పౌరాణిక జనంబువలన వినంబడుచుండు
పుణ్య శ్లోకుండును మహాభాగుండును నగు జనార్దనుండు విశేషంచియు నెచటనెచ్చట నధివసించి ప్రకాశించుచుండుఁ బురాణఙ్ఞుండవు సమర్థుడు ననఁ బరగునీ వలన నేతత్ప్రకారంబు వినవలయు నని మనంబునం గౌతుకంబు విస్తరిల్లుచున్నయది నీవిది నాకుం దేటతెల్లంబుగా నెిగింపవలయునని ప్రార్థించిన
విని యగస్త్యమునీంద్రుఁడతని కిట్లని తెలుపందొడంగె.

తే.పుడమి గోదావరికిఁదూర్పు కడను తుల్య
    భాగకు నుదత్కటంబున పశ్చిమమున
      వారిరాశికిఁ గోసెడు మేర సర్ప
     పురమహాక్షేత్ర మభిరామ గరిమనలరు

తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమీ వృద్ధగౌతమీ
 కౌశికీచ వశిష్ఠాచ తథా సాగరం చ గతాః


ఆ పుణ్య క్షేత్రం లో నారద సరోవరము, అనంత సరస్సు, ముక్తి కాసారము అని మూడు తీర్థములు గలవు.
ఆ క్షేత్రములో భావనారాయణ స్వామి నారదునిచే ప్రతిష్టించ బడి పూజలందుకుంటున్నాడునచట.


క.మందార శాఖ తెఱంగున
   వందారుక జనుల నెల్లను వరఫలముల నా
    నందింపఁగ జేయుచు హరి
    యందంబుగ బుధులు పొగడ నందుండుఁ జుమీ


శేషుని తపస్సు

శా.  అక్షీణోగ్రతపస్సమాధినటు నిద్రాహారముల్ మాని య

       బ్జాక్షశ్రీ పదపంకజాత యుగళ ధ్యానావగాఢాత్ముడై

       దీక్షంగ్రాలుచు నున్నచో హరి రమాధీశుడు విష్ణుండు దాఁ

       సాక్షాత్కారముఁ బొందె నభ్రమున నా చక్షుశ్శ్రవ స్వామికిన్

సీ.  శంఖగదాసి శార్ఙ్గా యుధ ములతో భవ్యజాంబూనదాంబరముతోడ
       వనమాలికావృత వక్షస్థలంబుతో గౌస్తుభ శ్రీవత్సకములతోడ
       పద్మరాగాశ్మ శుంభత్కిరీటంబుతో నవరత్న మయభూషణ ములతోడ
        సురుచిర హరినీల శోభితాంగంబుతో నండజాధీశ వాహనము తోడ

తే.  నెలమి బ్రత్యక్షమై మ్రోల నిలిచి యున్న
      యాదినారాయణునిఁ బరమాత్మఁ గాంచి
     యలర దండప్రణామంబు లాచరించి
      యురగకుల భర్త దల వాంచి యూరకుండె



నాయనా నీకొచ్చిన  కష్టమేమిటి? ఎందుకు ఘోర తపస్సు చేస్తున్నావు అని పరమాత్ముడు అడుగగా
శేషుడు తన కష్టం స్వామితో విన్న వించుకుంటాడు.



తన కథ చెప్తాడు

మ.నలినాక్షాయ నమోఽస్తుతే భగవతే నానాజగద్రూపిణే
      ఖలహృద్దర్పతమస్సహస్ర ఘృణయే కైవల్య నాథాయ ని
      ర్మలకారుణ్య గుణాయ ధాతృగురవే మన్దాకినీ నామ  శై
      వలనీ ప్రోద్భవ కారణాయ యనుచున్ వాక్రుచ్చి కేల్మోడ్చినన్

నిన్ను నా తల్పముగా చేసుకుంటాను.

నీ నామము తో ఈ క్షేత్రము సర్పపుర క్షేత్రముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ తీర్థం అనంత సరస్సు గా పిలువ బడుతుంది.

తరువాత కాలంలో నారదుని  చేత ప్రతిష్టించ బడి భావనారాయణనిగా పూజలందుకుంటాను.

  మునులు తరువాతి.  కథ అడుగుతారు.

నారదుడు బ్రహ్మ లోకమునకేగుట

అక్కడ బ్రహ్మ సభ జరుపుతుంటాడు.
దేవతలు, మునులు ఆసీనులై ఉంటారు.
బ్రహ్మ విష్ణు  మహిమలు, విష్ణు మాయ గురించి చెప్తుంటాడు.


తే.  స్రష్టయును సృజ్యుఁడును దానె జగములందు
       రక్షకుడు రక్ష్యుఁడును దానె ప్రత్యహంబు
      హర్తృ సంహార్యులును దానె యతి కృపా ప
      రాయణుండైన యాదినారాయణుండు.


నారదుడు గర్వోక్తులాడుట

తండ్రి నీవు చెప్పింది నిజమే కాని నేను ఆ విష్ణు మాయలో చిక్కుకోను అని గర్వముగా పలుకుతాడు.
దానికి బ్రహ్మ కోపించి దానికి నీవు తగిన ప్రతిఫలం అనుభవిస్తావు అని శపిస్తాడు.

��ద్వితీయాశ్వాసము

నారదుడు సర్పపురము చేరుట

చ. చని చని కాంచె సిద్ధ సుర చారణ యక్ష భుజంగ కన్య కా
      జన కుచ కుంభ సంభృత విశంకట సంకుమదైణ నాభి చం
       దన ఘన సార సౌరభ నితాంత సుగంధి సరోభి రామమున్
      ధన కనక ప్రకీర్ణ మణి ధామము సర్ప పురీ లలామమున్

సీ. వేద వేదాంత ప్రవీణ విప్రకులంబు , పరగ భాగవత విభ్రాజితంబు
     దీపిత నవరత్న గోపుర ప్రకరంబు  , సరస పుణ్యాంగనా సంవృతంబు
     పల్లవ ఫల పుష్ప బందురోద్యానంబు , పావనానంత సరోవరంబు
     దివ్య దేవాగార దేదీప్యమానంబు , భర్మనిర్మిత హార్మ్య భాసురంబు

భూరి గారుత్మత ద్వార తోరణంబు
గురుతరానర్ఘ్య  మాణిక్య కుట్టిమంబు
లాలితోదగ్రహరి నీల జాలకంబు
పుణ్య నిలయంబు శ్రీసర్పపుర వరంబు
 
ఆ కొలను  లో మునిగి స్నానము చేసి  బయటకు వచ్చే సరికి నారదుడు  ఆడదియై నిలిచాడు.


సీ.కొదమ తుమ్మెద దిమ్ము నదలించు పెన్నెఱుల్ ! కెందమ్మివిరుల నేల్ కేలు గవయు
    జక్కవ కవఁ నుల్లసములాడు చను గుబ్బ ! లలఁతి చీమల బారుఁ గలఁచు నారు
    బున్నమ రేఱిని నెన్ను ముద్దు మొగంబుఁ!  పగడాల నళికించు తొగరుమోవి
    కలువ ఱేకుల సౌరు గెలుచు వాల్గన్నులు !  బొన్న క్రొన్ననఁ గేరుపొక్కిలియును

జికిలి క్రొమ్మించు టద్దంపుఁ జిన్నపుచ్చు
తళుకుఁజెక్కులు మొల్ల మొగ్గల హొరంగుఁ
దెగడు పలు చాల్పుఁ దిన్నెల నగు పిఱుఁదులు
గలిగి యబ్రంపు నెఱ రాచ కలికి యయ్యె

నారదుడు స్రీ యై సుదతి నా బరగి వరునికై వెదకుట
--------------------------------------

వీరబాహు  పౌత్రుడు శ్రుతకీర్తి పుత్రుడు నికుండుడు చంద్ర వంశ సంజాతుడు

చ.భానుఁడుదగ్ర తేజమున భావభవుడువిలాసలీల వై
    శ్వా నరుడుగ్ర రోషమున వాసవుఁ డాతత కీర్తి చే మహా
  సేను డదభ్ర వీర్యమున శేషుడు వాగ్విభవంబునన్ రమా
  జాని కృపారసంబున రసాస్థలి నిస్తుల శాంతి వైఖరిన్

పీఠికా పురమును పరిపాలిస్తు  , ఒక రోజు వేటకోసం అడవికి వెళ్తాడు.

శరద్వర్ణనము

 శా. అంతన్ భ్రాంత సరస్సమగ్ర బిసనాళా హార లీలా పరి
      భ్రాంతానంత మరాళికా నిచయ సుశ్రావ్యస్వనా కర్ణ నా
    శ్రాంతాత్యంత కుతూహలోల్లసిత భాస్వచ్ఛాలి పాలీ జన.                  &&&&&&&&&&&&&&
    స్వాంతంబై శరదాగమంబు దనరెన్ సర్వంసహా మండలిన్



నికుండుడు వేట సలిపి  అలసి సేద తీర్చు కుందామని  అనుకునే సరికి అతనికి
ఒక ఉద్యానవనం కనిపిస్తుంది.

సీ. హారీత శుక శారికారవాక్రాంతంబు పరభృత కూజిత విభ్రాజితంబు
     సరస గానకళా నిశభ్రమద్భ్రమరంబు ప్రమద నృత్యన్మత్త బర్హిణంబు
    నికట సరోహంస నిస్వనాకీర్ణంబు సాంద్రపుష్ప పరాగ  సంకులంబు
      ఫల భార కుసుమ స్తబక లసద్భూజంబు మృదుల మరందఝరీ పరీత


 మతిత రామోద మేదురాత్యంత శీత.        పరిమళం
లానిల కిశోర వారసమాదృతంబు
నైన య క్కాననంబు భూజాని కపుడు
మోదమును గూర్చె గడితంపు సేద దీర్చి


మ.  కనియెన్ భూపకుమార మౌళి యొక రాకా చంద్ర బింబాననం
        గనకాంగిం గలకంఠకంఠిఁ గలికిం గస్తూరికా సౌరభం
      గనదంభోజదళోపమాన నయనన్ గంధేభకుంభ స్థనిన్
      ఘనసారాచ్ఛదరస్మితన్ ఘన కచం గాంతాజనగ్రామణిన్  


కనియెన్ దానవదూత సూక్ష్మ నయనన్ కాలాంతకాకార ని
ర్ధనజీవన్ ఖరవాణిన్ గీశసమవక్ర్తన్ రక్త వర్ణాలకన్
గనదుద్యద్వసుధాధరాంచిత వలగ్నన్ భూరినీలాధరన్
ఘనదేహన్ లసదుష్ట్రయాన విలసత్కాంతాకదంబాధమన్


క. రాజానన కనుగొనియె వి
    భ్రాజన్మణిభూషణాభి రామ శరీరున్
    రాజ కుమారున్ జిత సుర
    రాజకుమారేందు రాజ రాజ కుమారున్

చూచి అతడు కంతుడా, జయంతుడా ఇందుడా అని తల పోస్తుంది


ఎవ్వతె నీవు,

సీ. కలహంస గామిని కరటికుంభస్ధని కర్పూర దరహాస కంబు కంఠి
     కలకంఠ కల వాణి కాహళికా జంఘ కహ్లార దళపాణి కమల వదన
     కాసార నిభనాభి కంఠీరవలగ్న కనకకోరక నాస కైరవాక్షి
    కస్తూరికా గంధి కచ్ఛఫ చరణాగ్ర కార్ముక భ్రూవల్లి  కాంచనాంగి
 
కదళికా స్తంభ రుచురోరు కాండ యుగళ
కల్పభూజాతనవలతా కలిత బాహ
కాలజీమూత నీకాశ ఘనశిరోజ
కామినీ మణి ననుఁ బ్రేమ గవయు మిపుడు
   
సంసార సుఖాలు అనుభవించి , నూర్గురు కుమారులను కని సంతోషంగా. ఉంటారు.
రిపుంజయుడనే రాజు తో జరిగిన యుద్ధం లో అందరు చని పోతారు.
సుదతి యుద్ధ భూమిలో తన భర్త నికుండుని , తన 100 కుమారుల శవాలు చూసి చాలా దుఃఖిస్తుంది.
ఇంతలో ఆమెకు బాగా ఆకలి గా  ఉండి, ఒక పండు చూసి కోయబోతుంది. అది అందదు.
విష్ణువు నారదుని అనుగ్రహించాలని తలచి వృద్ధ విప్రుని రూపంలో వచ్చి సుదతి ని
పరామర్శిస్తాడు. సరస్సు లో స్నానముల చేసి శుచివైతే నీ కష్టాలు తీరి పోతాయని చెప్తాడు .
స్రీ రూపములో నున్న నారదుడు దగ్గర నున్న కొలనులో స్నానముల చేసేసరికి. పూర్వము నారద రూపము వస్తుంది .



��తృతీయాశ్వాసము


క. తటిదుపమాన జటావలి
   పటికపు  జపమాల కర విపంచియు ధవళో
  త్కట తనువుఁ గలిగి మఱి యె
  ప్పటి నారద మునియ యగుచుఁ బటుగతి నిలిచెన్

ఆ కొలనులో మునిగిన స్రీ రూపము పోయి మరల తొల్లిటి నారదుడై తటాకంలోనుండి బయటకు
వచ్చి, ఒక చెట్టు క్రింద కూర్చొని సందేహము తో ఆలోచిస్తున్నాడు.
ఏమిటి యీ వింత అని,1 కలా? నిజమా ?
కలైతే. నిద్రించ లేదే ?
2) భ్రాంతియా ?  వస్తువేదీ కనబడలేదే  3) మోహమా. ?  తెలివి తేటలు బాగానే 4) ఐంద్ర జాలమా?
చేస్తే వ్యక్తి  ఎవరు కనబడరే.

ధ్యాయతో విషయాంపుఁసః సఙ్గస్తేషూపజాయతే సఙ్గాత్సఁజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే (02:62) క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః స్మృతిభ్రఁశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి (02:63) విషయ వాంచ్హలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

స్రీ రూపం ధరించటం, నికుండుడుని పెళ్ళాడడం , పిల్లలను కనడం ఇదంతా విష్ణు మాయ లాగ
ఉంది.
తృటి కాలంపాటు. జరిగింది

క. ఎవ్వనిచే సృష్టంబగు
     నివ్విశ్వము ప్రోదిచేయు నెవ్వాడు జగం
     బెవ్వనియందడఁగున్మఱి
     యవ్విభునకు నేను ప్రణతు లర్థి నొనర్తున్


అప్పుడు నారదుని ముందు విష్ణువు ప్రత్యక్ష మౌతాడు

సీ. సనకాది ముని మనస్సరసిజ భ్రమరాయ, వారణేన్ద్ర విపన్నివారణాయ
    శత మఖ ప్రముఖ నిర్జర గణ ప్రణుతాయ , ఘోర సంసారాబ్ధి తారణాయ
    నలిన గర్భాణ్డ మణ్డల బృహజ్జఠరాయ , క్రూర దైతేయ విదారణాయ
     కమల వధూముఖ కమలాబ్జమిత్రాయ , దర సుదర్శన శార్ఙ్గ ధారణాయ

ఘనతరాశేష భువనైక కారణాయ
సతత పాలిత ముని సిద్ధ చారణాయ
సర్ప నగరానవరత ప్రచారణాయ
భావనారాయణాయ తుభ్యం నమోస్తు

నేను నీ చేత ఈ నాటకం ఆడించాను.నీవు అలుగబోకు.
నీవు మునిగిన ఈ సరస్సులో మునిగిన జనులకు సకల పాపాలు తొలగి పోతాయి.
ఇది నారద తీర్ధంగా ప్రసిద్ధి చెందుతుంది.
అంగనా రూపం  నిర్ముక్తి అగుట చేత - ముక్తి కాసారమని పిలువబడుతుంది.

ఈ తీర్థంలో స్నానం చేసిన వాడు నా పదము  చేరుతాడు

ఈ నీరు సేవించిన వానికి  బ్రహ్మ హత్యా పాతకాలు నశించిపోతాయి.

పర్వ దినాలలో స్నానం. చేస్తే  అ శ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది.

ఇక్కడ పిండ ప్రధానం చేస్తే గయలో చేసిన పుణ్యము లభిస్తుంది.

నారదుడు భావ నారాయణుని ప్రతిష్ట చేస్తాడు.

దివిజ ముఖ్యులు స్వామిని నుతించుట

సీ. దివి మస్తకము చంద్ర దినకరుల్ కన్నులు !వహ్ని ముఖంబుదేవతలు భుజము
      లవని యంఘ్రులు విహాయసము పొక్కిలి దిశల్ !శ్రవణంబు లామ్నాయముల సమితి వాక్కు
        లనిలుండు ప్రాణము యముడు మానసమును నాకంబు కంధరంబును,గచ భరంబు
        భారతి నాలుక పాథోనిధుల్ కుక్షి  క్రతుభుక్చికిత్సకులు కటి తలంబు

        గాగ విశ్వరూపివై కరము మెరయుచుండు నీ మేన నలిన గర్భాణ్డ భాండ
       మండలులుదంబరఫలోపమానములై వెలయుచుండుఁ గదా జగద్వినుత

దివి మస్తకము  -చంద్ర దినకరుల్ కన్నులు -
వహ్ని ముఖంబు.   -దేవతలు భుజము
      లవని యంఘ్రులు
 విహాయసము పొక్కిలి
దిశల్ !శ్రవణంబు
లామ్నాయముల సమితి వాక్కు
        లనిలుండు ప్రాణము
యముడు మానసమును
 నాకంబు కంధరంబును,గచ భరంబు
        భారతి నాలుక
పాథోనిధుల్ కుక్షి
క్రతుభుక్చికిత్సకులు కటి తలంబు

        గాగ విశ్వరూపివై కరము మెరయుచుండు నీ మేన నలిన గర్భాణ్డ భాండ
       మండలులుదంబరఫలోపమానములై వెలయుచుండుఁ గదా జగద్వినుత


ప్రతి వైశాఖ మాసం లో యిక్కడకు వచ్చి భావనారాయణునికి పూజ చేసి మీ కోర్కెలు ఈడేర్చు కొండి.

  మునులు లక్ష్మీదేవి స్తుతి చేయుట

నీ కరుణా విలోకనము నిల్పినచో ఁకులహీనుడున్ హయా
నేకప హేమచామర మణీ రమణీయ విభూషణాదికా
స్తోక విభూతిన్ జెంది పరిశుద్ధ కులుండనమించు లేనిచో
నాకనివాసుడున్ వెతల నందుఁ గదమ్మ జగత్కుటుంబినీ

శివుడు  భావ నారాయణుని స్తుతించుట


మహియు సలిలంబు దేజంబు మారుతాభ్ర
ములు మనోబుద్ధ్యహంకారములును భిన్న
సరణులయ్యు నభిన్నతఁ బరగి యేమ
హామహు రూప మయ్యెనయ్యనఘఁగొలుతు

  నారదుని స్తుతి

మంగళమిందిరావిమల మానస నవ్య సరోరుహాళికిన్.               అంత్యనుప్రాసం
మంగళ మాశ్రితావన సమగ్ర కళా విలసద్గుణాళికిన్
మంగళముగ్ర దానవ తమస్సమ వాయ కరాళ హేళికిన్
మంగళమండజప్రవర మంజుల పాలికి దేవమౌళికిన్

నేను ఇచ్చట రమ, భూదేవి, నీల తో వెలసి  పూజలందు కుంటాను.

స్వస్తి

త.దర సుదర్శన శార్ఙ్గ నందక ధారణా శుభకారణా
    హరిహయప్రముఖాఖిలా త్రిదశావనా మునిపావనా
    సురవిరోధివరూథినీ పరిశోషణా నత పోషణా
    వరశకుంతకులాధినాయక వాహనా నవమోహనా