7, ఏప్రిల్ 2016, గురువారం

వాతావరణ శాస్ర్తజ్ఞుల ప్రకారము రాబోయే కొన్ని నెలలు ఎండలు విపరీతంగా ఉంటాయని తెలుస్తుంది. ఆ ఎండల బారి నుండి మనలను కాపాడుట కోసం


దుర్ముఖి సంవత్సరానికి  స్వాగతం

కం.  మర్మము లేకయె జనులకు
       ధర్మమ్ముగ సుఖము శాంతి దాంతియు నొసగన్
       'దుర్ముఖి 'రావే పుడమికి
       నిర్మల బంధుర సుగంధ తెమ్మెర తేవే

కం. దుందుడుకొప్పగ 'దుర్ముఖి '
      దుందుభి నిస్వనముతోడ కుంభిని తాకెన్
      విందొనరఁగ పుడమి ప్రజ
      బంధుర నైదాఘ ఘర్మ శమనంబునకై

     రచన :  డా. కోమలరావు బారువ 

1, ఏప్రిల్ 2016, శుక్రవారం





సభ కు నమస్కారము


ఓం నమః శివాయః 
ఎందరో 
మహా మహులు ఎన్నో ఆధ్యాత్మక సాహిత్య ప్రసంగాలు చెప్పిన ఉపనిషణ్మందిరములో మాట్లాడానికి నాకు అర్హత శక్తి రెండూ లేవు.
నన్ను ఎందుకు ఎంపిక చేసి మాట్లాడమన్నరో నాకు అర్ధము కావడంలేదు.
బహుశాః సభ్యులను ప్రసంగాలలో భాగ స్వాములను చేద్దామని తలంపేమోమని నేను భావిస్తున్నను. వినాయక చవితి సందర్భంగా నన్ను ప్రసంగించమని కోరారు.కాని ,   .
.......... చక్రధారి   సినిమాలో అన్నట్లు
పరమహంసను కాను పండితుడను కాను హరి కీర్తనము తప్ప వేరేమి ఎరుగను.


పరమహంసను కాను పండితుడను కాను ,కేవల పఠ ణాభిలాషిని నేను అని నేనంటాను .


పద్యం అంటే నాకు ఇష్టం కారణంగా నేను పద్య కావ్యాలు చదువుతున్నాను.


అంతే కాని ప్రసంగాల్లు.నాకు క్రొత్త
ఏం మాట్లాడితే బాగుంటుదో అని ఆలోచిస్తే సందర్భోచితముగా ఉంటుంది కదా అని గణపతి ని స్తుతి చేసే పద్యాలు ఎంచుకున్నాను .


మనం ఏదైన శుభకార్యము చేసేటప్పుడు గణపతిని పూజించడం ఆనవాయతి .
అందుకే మన పూర్వ కవులుదేవతా స్తుతి చేసెవారు. ఆ సందర్భములో గణపతి స్తుతి ఒకటి. ఒక్కో కవి ఒక్కొలాగ పగడుతూ వ్రాసారు. అదే నా శీర్షిక గా తీసుకున్నను .


నా వివరణలో తప్పులుంటే నన్ను క్షమిస్తారని కొరుతున్నాను. 


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
 ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 
 అగజానన పద్మార్కం గజానన మహర్నిషం
అనేక దంతం భక్తా నాం ఏక దంతముపాస్మయే


 ఉ. తొండము నేక దంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ 
     మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లన చూపుల మందహాసముల్ - స్థూలము
     కొoడొక గుజ్జు రూపమున కోరిన  విద్యల కెల్ల నొజ్జవై
     యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ 
వామ=వక్రము
కొండొక=కొంచెము, చిన్న ,బాలుడు
@@@@@@@@@@@@@@@


భాస్కర రామయణం ...... 


 కవిత్రయం రచించిన భారతంలో .......శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
                                                         లోకానాం  
పోతన భాగవతం


ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడిదు ! అద్రి సుతా హృదయానురాగ సం
     పాదికిదోష భేదికి బ్ర! సన్న వినోదికి విఘ్నవల్లికా
     చ్ఛేదికిమంజువాదికి న!శేష జగజ్జన నంద వేదికిన్
     మోదక ఖాదికిన్ సమద !మూషిక సాదికిసుప్రాసిదికిన్


ఆదరము=గౌరవము , మన్నన.   ప్రసన్న=1. నిర్మలము;
2. సంతుష్టము.మోదకము= కుడుము, లడ్దు
పర్వత రాజ పుత్రియైన ఉమా దేవి మనస్సు లోని అను రాగ సంపదను సంపాదించి,కల్మషాలను భేదించి ఆపన్నుల విన్నపాలను ఆమోదించి ఆశ్రితుల వి ఘ్నలతలను ఛేదించి మంజుల మథుర భాషణలతో అశేష భక్తులకువిశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఆరగించి మూషిక రాజునధిరోహించి మూల్లోకాలకు మోద ప్రదాయియైన గణపతిని గౌరవముతో మ్రొక్కుతాను.
-----
    హర విలాసం- శ్రీనాధుడు
సీ.  కలిత శుండాదండ గండూషి తోన్ముక్త **              పొ౦ద బడినది
           సప్త సాగర మహా జల భరములు 
     వప్ర క్రియా కేళి వశ విశీర్ణ సువర్ణ                       శిథిలము,  వదలినది
       మేదినీ ధర రత్న  మేఖలములు.                        కొ౦డ నడుము , మొల నూలు 8


      పక్వ జంబూ ఫల ప్రకట  సంభావనా.                    సమ్మానము ( గౌరవము తో)
           చుంబిత భూభృత్కదంబకములు.                   అనుభవి౦చు , భుక్తముచేయు
     వికట కండూల గండ దేహమండలీ                    మిక్కిలి, విరివియైన వ౦కరయైన
        ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు.                  =కదల్పబడిన. వెడల్పు 
                                                                         ముఖము గలపాత్ర.


తే. శాంబవీ శంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు           .
మించి విఘ్నోపశాంతి గావించుగాత.         

                                                            




శా. జేజేయంచు భజింతు నిష్ట ఫల సం! సిద్ధుల్ మదిం గోరి ని
ర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్ర! స్యంది దానా౦బు నిం 
బూజా తత్పర దేవ దానవ కదం!బున్ బాలకేళీ కళా
రాజత్కౌతుక రంజితోరగ పతి !ప్రాలంబున్ హేరంబునిన్.  చంద్రుని నవ్వించే వాడిని


- మదిలో కోరిన కోర్కెలు సిద్ధించాలని కపటము లేని కృపాలయుని చెక్కిలినుండి దానజలము స్రవిస్తున్న దేవ దానవులచే పూజింపబడి మెడలో పాము జందెముగా వ్రేలాడుతున్న హేరంబుని నమస్కరించి భజించెదను.


ప్రౌఢ=ప్రగల్భుడు, నిపుణుడు, గంభీరుడు
దాన= ఏనుగు కపోల మదము
నమస్కారము,
-------
మను చరిత్ర- పెద్దన


.అంకముజేరి శైలతన! యాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్ట తొండమున! అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ
వంక కుచంబు గాన కహి! వల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గ! జాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌


--తన తల్లి తొడ మీద కుర్చొని స్తన్యము కుడుస్తూ బాల చేష్టతో ఆవైపున్న కుచమును పట్టు కుందామని తొండము చాచగా కుచమునకు మారు పాము తగుల తామర తూడని భ్రమించి పట్టుకున్న గణేశుని యిష్ట సిద్ధికై కొల్చెదను.

అచ్చతెలుగు రామాయణం- కూ. తిమ్మన


సీ. నేల తాలుపు రాచ చూలి గాదిలి కందు
          దొసగు చీకటి చాల్పు తొగల విందు


తుగ తిగ మొగముల జగ జెట్టి తోబుట్టు 
          పొగ డు వారల నట్టు పుడుకు చెట్టు


పెను బొజ్జ నిడ్డెనల్దినెడు నేరుపులాడు
             మేలికడాని డాల్మేని వాడు 


గోడ దొల్పెడు ఱాఁగ గుర్రంపు నెర జోదు
          గాటంపుటక్కటికముల పాదు


తే. నగుచు జిగి చెక్కుగవ జారు నామునీరు
గ్రోలుటకు జేరు జమిలి ముక్కాలి బారు
గొనబు పాటల కెదగేరు కొనెడు సౌరు
నెరపు నెర వేల్పు నా మది నిల్చు గాత
నేలతాలుపు= పర్వతము 
దిగ్గజాలు,అదిశేషుడు,ఆది వరాహం
పుడుకు= ఇచ్చు
పుడుకు మ్రాను, పుడుకు తొడుకు= కామ ధేనువు,పుడుకు కల్లు= చింతామణి
కల్పవృక్ష౦ , పారిజాతము,స౦తానము,మ౦దారము, హరిచ౦దనము
గాదిలి= ముద్దు,ప్రియమైన
ఱాఁగ=ఉద్ధతుడు 
జిగి= కాంతి
సౌరు=1. అందము; 2. విధము. 


నెర=నిండైన
నాము = పొగరు
గొనబు = మనోఙ్ణము
పాటలము = కాలి గొట్టు పువ్వు. తెలుపు ఎరుపు 


-----------


 మొల్ల రామాయణం


సీ. చంద్రఖండ కలాపు జారు వామన రూపు       -  భూషణము
గలిత చంచల కర్ణు కమలవర్ణు


మోదకోజ్జ్వల బాహు మూషకోత్తమ వాహు 
భద్రేభ వదను సద్భక్త సదను 
సన్ముని స్తుతి పాత్రు శైలరాడ్దౌహిత్రు .
ననుదినామోదు విద్యాప్రసాదు 


పరశు వరాభ్యాసు బాశాంకు శోల్లాసు 
నురుతర ఖ్యాతు నాగోపవీతు 
గీ.లోక వందిత గుణ వంతు నేక దంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు 
విమల రవికోటి తేజు శ్రీ విఘ్న రాజు- స్వచ్ఛ౦
బ్రథిత వాక్ప్రౌఢి కై యెప్ప్డు బ్రస్తుతింతు -- భాషాజ్ఞాన౦. ప్రసిద్ధి


గోపినాకవి- గోపినారామాయణం


పంచచామరం
అజాది దేవబృంద మేమ!హాత్ము భక్తినాత్మలో
నజస్రమున్భజించివాంఛి! తార్ధ సిద్ధి గాంచు నా
గజాస్యు సర్వ దేవతాగ్ర! గణ్యుగార్తికేయ పూ
ర్వజున్ గణాధిపుం ద్రిలోక! వందితున్ భజించెదన్


-------

పారిజాతాపహరణం-నంది తిమ్మన 

మ. 
తన దంతాగ్రము చేతఁ దీక్ష్ణ మతి ,యుద్యత్కుంభ యుగ్మంబుచే /
త నితాంతోన్నతి,దానవిస్ఫురణ నుత్సాహంబు ,శుండాముఖం/
బున దీర్ఘాయువు , నిచ్చుఁగాత గుణాంభోరాశికిం గృష్ణ రా/
యనికి న్వారణ రాజ వక్త్రుండు కృపాయ త్తైక చిత్తాబ్జుడై. / 


హృదయ పద్మము న౦దు కృప కలిగిన వాడై.  గజ ముఖుడు

బుద్ధి తీక్ష్ణత్వము, పాలన శక్తి,బలము ఉన్నతి, దీర్ఘాయువు

నన్నె చోడుని- కుమార సంభవం

చ. 
తనువసితాంబుదంబు ,సితదంత ముఖంబ చిరాంశు,వాత్మగ
ర్జన మురుగర్జనంబుఁ ,గర సద్రుచి శక్ర శరాసనంబునై. 
చన మద వారి వృష్టి హిత సస్య సమృద్ధిగ నభ్రవేళ నాఁ , 
జను గణ నాధుఁ , గొల్తు ననిశంబు నభీష్ఠఫల ప్రదాతగాన్.
             


భట్టు మూర్తి - వసు చరిత్ర
శా. దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయం గ్రాహముం 
     గంతు ద్వేషికి గూర్చి శైలజకుం తద్గంగాఝ రాచాంతి న 
     త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుం డై పితృ
     స్వా౦తంబుల్వెలయింప జాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్ 


అ.హ.సం- samuka venkata kistappa


చ. కుడుములు చాల మెక్కి ,క!లుగుం లాయపు తేజి నెక్కి,ప్రా
నుడువుల వన్నెకెక్కి, మహి!నూల్కొను విఘ్నములెల్ల జెక్కి య.   
య్యుడుపతి మౌళి పాదముల!కున్నత భక్తిని మ్రొక్కి భక్తులన్ 
విడువక ప్రోచు భవ్య మతి !విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్


ప్రానుడువు=ఆగమము, ఆమ్నాయము, చదువు, ఛందస్సు, తొ(లు)(లి)చదువు
ప్రాతపలుకులు 
కమ్ముకున్న ,పురికొను
భవ్య= శుభప్రదుడు
----
అనిరుద్ధ చరిత్రము - అబ్బయామాత్యుడు


ఉ. అంబుజ గర్భ నిర్జరవరాదులచేత సపర్యలందు హే
రంబు కృపావలంబు మునిరాణ్ణికురంబ మనోంబుజాత రో
లంబుదరస్మితానన కళా జితశారద చంద్ర బింబు భూ
షాంబర రుగ్విడంబు విజితారి కదంబు భజింతువిద్యకై
---------
కవిరాజ మనోరంజనం-  అబ్బయామాత్యుడు . పురూరవ చరిత్ర


ఉ.పుష్కర తుండదీప్త పరి! పూరక లీన సమస్తమైన యా 
పుష్కరధిన్ నభస్థలికి! ఫూత్కరణోద్ధతి జిమ్మియ చ్చటన్
పుష్కరవాహినింగలయన్ ! బొందొనగూర్చిన విఘ్నరాజు ధీ
పుష్కరహేళి మత్కృతికి ! భూరి జయాభ్యుద యం బొసంగుతన్


ధీ=బుద్ధి
-------------


Naishadiiyamu-     Sri pada Krishna Murty Saastry


మ. నలుగుంబిండిని బొమ్మ జేసి యుమ ప్రా!ణంబు౦ ప్రతిష్టింప ము
ద్దుల బిడ్డం డయి వాకిటన్ హరునిఁబోఁ ! ద్రోల౦ గజాస్యంబునుం
కలలుం గల్గి గణాధిపత్యము వేడ్కం !గాంచు ద్వైమాతురుం
డెలమిన్ శ్రీరమణాంబికా సుతు మనో! ~భీష్టంబులన్ దీర్చుతన్


కలలము=అస్థి, ఎముక. శివుని ఆగ్రహానుగ్రహాలు  దక్షుడు, అజుడు
 ఎలమి=స౦తోష౦
--------------
నీలాసుందరి పరిణయం- కూ. తిమ్మన
కు౦భకుడు   గొల్ల వాని కూతురు. నీల


ఉ. మ్రొక్కులొనర్తు ఁకేలుగవ !మోడిచి చొక్కపుఁ గొక్కుఁ జక్కి పై
నెక్కెడు బల్వజీరునకు! నిమ్ముగ నమ్మిన వారిమేల్పనుల్
జక్కగ జేయు దేవరకు !జక్కెర కొబ్బెర పండు లుండ్రముల్
మెక్కెడు పాప జందెముల !మేటికి బత్తిని మాటి మాటికిన్


చొక్కము=అనుకూలము, అనువు, సరి 
జక్కి=అశ్వము, ఘోటకము. 
ఇమ్ము=విరివి
---------------


రుక్మిణి పరిణయం - కూ .తిమ్మన 


చ. అనుదినమున్ మదిం జలన !మానక మానక పూని దీనులన్. **
మనుచుచుఁ కార్య వేళల ను!మాధవ మాధవ ముఖ్యులౌ సురల్
దను వినుతింప మేలిడుచు ఁ !దానగు దాన గుణాడ్యు డంచు నిం
పెనయఁగఁ గోరి మ్రొక్కిడుదు !నేనిఁక నేనిక మోము సామికిన్


చిత్తచలనము
పూని = పట్టుదల తో
ఇంపు=ఇష్టము
--------

శశాంకవిజయం - శేషం వే౦కటపతి


మ. హర జూటానటదాపగాంబు !ఝరి తుండాగ్రంబునం ఁ బీల్చి సా. **
 దరతం దజ్జలజంబు తల్లి కి! సముద్యత్పుష్కరాకృష్ట సా
గర గౌర్యగ్రజ కంధరాంత!ర ఫణి గ్రైవేయకంబద్భుత
స్ఫురణం తండ్రికొసంగి ముద్దు! కొను దేవుండిచ్చు నిర్విఘతన్ 
------------


కాళహస్తీశ్వ్వర మాహాత్మ్యం - ధూర్జటి 


స్తుతమతి యైన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేల కల్గెనో
అతులిత మాధురీ మహిమ...
శా. సర్గస్థిత్యపహార కర్మ నవ దీ!క్షావేళ బ్రహ్మ స్వ భూ 
భర్గు ల్విఘ్నములేక సాగుటకునై !ప్రార్ధింపగాఁ దత్క్రియా
దౌర్గత్యంబునదల్చి సంస్మరణా మా!త్రం బ్రాప్తి ఁ గావించు దృ
ఙ్నిర్గ చ్ఛ త్కరుణా కదంబుఁ గొలుతు !నిత్యంబు హేరంబునిన్ 


దృక్=చూపుల నుండి }. కరుణతోమిళితమై జారు తున్నచూపులు గలవాడిని
నిర్గమత్=బయటకు వస్తున్న కరుణ}. 
కదంబము= గుంపు, మిశ్రము. }


-----------
శుక సప్తతి -పాలవేకరి కదిరీ పతి
పాలవేకరి కదిరీ పతి చంద్ర వంశపు రాజు

27 కథలు 70 రోజుల్లో చెప్పాడని


ఉ. ముద్దులుఁ గుల్కు శైల సుత !ముందర శైశవలీల నాడుచో.  మనోఙ్ణము
     నొద్దిక నున్న తండ్రి తల !యూచ జటా మకుటాబ్జ రేఖ పై  విలాసము
     నిద్దపుఁ నబ్జ మోహమున ! నెమ్మి ఁ గరాగ్రము సాచు వేలుపుం 
      బెద్ద గణేశు ఁగొల్తు మద!భీప్సిత కావ్యకళా నిరూఢికిన్  
ఒద్దిక=విలాసము
తలయూచు=మెచ్చుకొను
నిద్ధపు=నిగ్ధము, నునుపైనది.
2. స్నేహము.
నెమ్మి=నెమ్మది, ప్రేమము. రూఢి=ప్రసిద్ధి
-------------
శ్రీ శివ పురాణం -శ్రీ ముదిగొండ నాగవీరేశ్వర కవి 


క. సకలామర సముదయమునఁ
బ్రకటితముగఁదొల్త పూజఁ బడసి ప్రమథనా  
యకుడై కడు మాతా పిత
లకు మురుపిడు దంతి ముఖు దలతుమదిఁబ్రణతిన్
మురుపు=
Delight, glee, liking. సంతోషాతిశయము. 


కరుణశ్రీ


ఎలుక గుఱ్ఱము నెక్కి నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు 
ముల్లోకములనేలు ముక్కంటి ఇంటిలో 
పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు 
' నల్లమామా ' యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని 
నూరేండ్లు నోచిన నోము పంట 

అమరులందగ్ర తాంబూలమందు మేటి 
ఆరు మోముల జగ జెట్టి అన్నగారు 
విఘ్నదేవుడు  వాహ్యాళి వెడలి వచ్చె -- స్వారి
ఆంధ్ర విద్యార్ధి లెమ్ము జోహారులిడగ

క. తొండము గల దేవా మా 
కండగ నీవుండి మమ్ము కావగ రావా
చుండెలుక నెక్కి లోకుల 
గండాలను రూపు మాపు గౌరీ తనయా

స్వస్తి